RK Roja: పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్‌కి పంపాలంటే భయమేస్తోందన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా అంటూ ప్రశ్నించారు. గత నెల 29 న అదృశ్యమైన పాప నాలుగు రోజులపాటు ఆ సమీప ప్రాంతాల్లోనే ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారని ఆరోపించారు. వారం తర్వాత ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బాలిక శవమై కనిపించిందంటే ఈ హోం, డిప్యూటీ, సీఎం లు ఏం చేస్తున్నట్టు అంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా అంటూ మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారన్నారు. మహిళల, పసిబిడ్డల భద్రత కోసం ఎవరూ లేరన్నారు. తప్పుడు కేసులు పెట్టడానికి మదనపల్లి ఫైల్స్ అని ప్రత్యేక హెలికాప్టర్నుపంపిన ప్రభుత్వం ఫైల్స్‌కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకు ఇవ్వదా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Read Also: CM Chandrababu: ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు
Also Read
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
లోకేష్ నియోజకవర్గంలో 24 గంటల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిగిందంటే పాలించే అర్హత వీళ్ళకు ఉందా అంటూ వ్యాఖ్యానించారు. హోంమంత్రి పక్క నియోజకవర్గం లో రాంబిల్లిలో ఒక యువతి కాపాడమని కోరినా పట్టించుకోకపోవడంతో జైలు నుంచి వచ్చి నిందితుడు చంపేశాడని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 9 వ తేదీ పుంగనూరుకు వస్తున్నాడని తెలిసి ప్రభుత్వం, హోం మంత్రి పరుగులు తీస్తున్నారన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపుతో దిశ చట్టాన్ని, మహిళా పోలీసులను నిర్వీర్యం చేయకుండా బలోపేతం చేయాలన్నారు. మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే అని గుర్తు తెచ్చుకుని మహిళా రక్షణను పెంచాలని సూచించారు. తక్షణం పుంగనూరు ఘటన నిందితులను తక్షణం అరెస్టు చేయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!