NTV Telugu Site icon

RK Roja: హోంమంత్రి రాజీనామా చేయాలి.. పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి రోజా

Rk Roja

Rk Roja

RK Roja: ప్రజలు ఓట్లు వేసి గెలిస్తే సరిగ్గా పరిపాలన చేసే వారేమో కానీ ఈవీఎంతో గెలిచారు కాబట్టి పరిస్థితి ఇలా ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రి విఫలం అయ్యారని తోటిమంత్రి పవన్ చెప్పాడు కాబట్టి అనిత ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ సహా అన్ని శాఖలు చంద్రబాబు వద్ద ఉన్నాయన్నారు. పవన్‌‌‌‌ ముందుగా.. సీఎంగా చంద్రబాబును రాజీనామా చేయాలి డిమాండ్ చేయాలన్నారు‌. రాష్ట్రంలో శాంతిభద్రతలు జీరో అని విమర్శించారు. సీఎం, డిప్యూటి సీఎం సహా హోం మంత్రి అనిత ఒక జీరోలా‌‌.. దేనికి పనికిరాకుండా పోయారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Read Also: Minister Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించాలి..

రాష్ట్రంలో పోలీసులను తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయిందన్నారు. పోలీసులు అధికారులతో పని చేయించుకోలేని చేతకాని పరిస్థితులలో మంత్రులు ఉన్నారా అంటూ మండిపడ్డారు. క్రింది స్థాయి అధికారులు కానీ పోలీసులు సరిగా పని చేయకపోతే ఆ వైఫల్యం ప్రభుత్వానిదేనని విమర్శించారు. పేరుకే హోం మంత్రి గాని కనీసం కానిస్టేబుల్‌ విలువ కూడా లేని స్థితిలో అనిత ఉన్నారన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పిల్లలపై అత్యాచారం జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. పిఠాపురంలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ షూటింగ్ చేస్తూ గడిపేశాడని.. నమ్మి ఓటు వేసిన ప్రజలను డిప్యూటీ సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బాధ్యతగా పనిచేసే లాండ్ ఆర్డర్‌ను చక్క పెట్టాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.

 

Show comments