RK Roja: హోంమంత్రి రాజీనామా చేయాలి.. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి రోజా
- కూటమి ప్రభుత్వంపై ఆర్కే రోజా మండిపాటు
- హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
- రాష్ట్రంలో శాంతిభద్రతలు జీరో అంటూ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: ప్రజలు ఓట్లు వేసి గెలిస్తే సరిగ్గా పరిపాలన చేసే వారేమో కానీ ఈవీఎంతో గెలిచారు కాబట్టి పరిస్థితి ఇలా ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రి విఫలం అయ్యారని తోటిమంత్రి పవన్ చెప్పాడు కాబట్టి అనిత ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ సహా అన్ని శాఖలు చంద్రబాబు వద్ద ఉన్నాయన్నారు. పవన్ ముందుగా.. సీఎంగా చంద్రబాబును రాజీనామా చేయాలి డిమాండ్ చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు జీరో అని విమర్శించారు. సీఎం, డిప్యూటి సీఎం సహా హోం మంత్రి అనిత ఒక జీరోలా.. దేనికి పనికిరాకుండా పోయారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Read Also: Minister Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించాలి..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
రాష్ట్రంలో పోలీసులను తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయిందన్నారు. పోలీసులు అధికారులతో పని చేయించుకోలేని చేతకాని పరిస్థితులలో మంత్రులు ఉన్నారా అంటూ మండిపడ్డారు. క్రింది స్థాయి అధికారులు కానీ పోలీసులు సరిగా పని చేయకపోతే ఆ వైఫల్యం ప్రభుత్వానిదేనని విమర్శించారు. పేరుకే హోం మంత్రి గాని కనీసం కానిస్టేబుల్ విలువ కూడా లేని స్థితిలో అనిత ఉన్నారన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పిల్లలపై అత్యాచారం జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. పిఠాపురంలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ షూటింగ్ చేస్తూ గడిపేశాడని.. నమ్మి ఓటు వేసిన ప్రజలను డిప్యూటీ సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బాధ్యతగా పనిచేసే లాండ్ ఆర్డర్‌ను చక్క పెట్టాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!