Ambati Rambabu: వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం..
- చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు
- వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం- అంబటి
- బుడమేరు.. కృష్ణానది వరదలను వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవటానికి..
- చంద్రబాబు ఉపయోగించటం దురదృష్టకరం- అంబటి రాంబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుడమేరు, కృష్ణానది వరదలను వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవటానికి చంద్రబాబు ఉపయోగించటం దురదృష్టకరమని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ను 3 బోట్లు ఢీకొన్న ఘటనకు వైసీపీ కుట్ర కారణమని చంద్రబాబు అపవాదు వేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. గతంలో లేనంత వరద వల్ల ఎగువ నుంచి ప్రవాహంతో వందల బోట్లు కొట్టుకు వచ్చాయి.. దిగువకు చిన్న బోట్లు బ్యారేజ్ నుంచి కిందకి కొట్టుకు పోతే, పెద్దగా ఉన్న 3 బోట్లు మాత్రం బ్యారేజ్ దగ్గర చిక్కుకు పోయాయన్నారు. పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేసిన కోమటి రాము.. టీడీపీ ఎన్నారై విభాగానికి చెందిన కోమటి జయరాం బంధువు అని తెలిపారు.
Read Also: Haryana Polls: లాడ్వాలో ముఖ్యమంత్రి సైనీ నామినేషన్.. హాజరైన కేంద్రమంత్రి ఖట్టర్
Also Read
లోకేష్ తో ఫోటో దిగిన ఉషాద్రి కూడా వైసీపీ నేతగా చెబుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. అలాగే.. నందిగామ సురేష్, తలశిల రఘురాం మీద మళ్ళీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగన్ కు సన్నిహితంగా ఉండే వారిని అరెస్ట్ చేయాలని.. చంద్రబాబు చేసే చౌకబారు ఎత్తుగడలతో మీరే భ్రష్టు పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వరద వస్తుందని ముందే హెచ్చరిక చేయాల్సిన ప్రభుత్వం.. ఆ పని చేయలేదని ఆరోపించారు.
Read Also: Kiren Rijiju: వక్ఫ్ బిల్లుపై ముస్లింలను తప్పుదోవ పట్టించేలా జకీర్ నాయక్ ప్రచారం..
కేంద్రంలో బీజేపీ.. ఏపీలో జనసేన అండగా, చంద్రబాబు ఇలా చేయటానికి ప్రధాన కారణం జగన్ అని అంబటి రాంబాబు తెలిపారు. జగన్ అంటే చంద్రబాబుకు భయం.. ఈ ఎన్నికల్లో గెలుపు తమ సొంత గెలుపు కాదని.. అందరిదీ అనే విషయం చంద్రబాబుకి తెలుసన్నారు. జగన్ వెనుక 40 శాతం ఓటు బ్యాంక్ ఉండటంతో వైసీపీని అణిచివేయాలని చంద్రబాబు ఆలోచన అని పేర్కొన్నారు. పడవలకు వేసే సహజ రంగులను వైసీపీకి ముడి పెడుతున్నారని.. వరదలు వచ్చి 10 రోజులు గడుస్తున్న బాధితులకు సాయం అందటం లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!