Rohit Sharma: నేను ఎవరినీ కలవలేదు.. అవన్నీ అవాస్తవాలే: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma about T20 World Cup 2024 India Team: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ భేటీ అయ్యాడని, భారత జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తంగా 20 మందిని ఎంపిక చేశారని.. ఇందులో 15 మంది ప్లేయర్స్, ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్లు ఉన్నారనే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తాను ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌కి సంబంధించి ఎవరినీ కలవలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలే అని అన్నాడు. భారత జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేస్తామని, అప్పటివరకు వచ్చే వార్తలను ఎవరూ నమ్మోద్దని రోహిత్ విజ్ఞప్తి చేశాడు.
తాజాగా మాజీలు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు కలిసి క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు విషయాలపై స్పందించాడు. రోహిత్ మాట్లాడుతూ… ‘టీ20 ప్రపంచకప్‌కి సంబంధించి నేను ఇప్పటివరకు ఎవరినీ కలవలేదు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దుబాయ్‌లో గోల్ఫ్ ఆడుతున్నాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో తన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు. బహుశా రాహుల్ భాయ్ తన కుమారుడి కోసం ముంబై వచ్చి ఉంటాడు. మేం ముగ్గురం ఇప్పటివరకు కలవలేదు. ఇక జట్టును ఎలా నిర్ణయిస్తాం’ అని ప్రశ్నించాడు.
Also Read
Also Read: Shubman Gill Lady: అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయిన శుభ్‌మన్ గిల్.. వీడియో వైరల్!
‘నేను, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ లేదంటే బీసీసీఐ స్వయంగా కెమెరాకు ముందుకు వచ్చి మాట్లాడితేనే అవి నిజాలు. లేదంటే అన్ని ఫేక్. టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును మేం అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకు ఎలాంటి వార్తలను నమ్మొద్దు’ అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. పొట్టి ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు