Shubman Gill Bowled Over By Lady Fan Cuteness: టీమిండియా యువ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓ అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో లేడీ ఫ్యాన్‌ను చూసిన గిల్.. ఆమె అందానికి ఫిదా అయ్యాడు. ‘అబ్బా.. ఏముందిరా’ అనే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ గిల్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు.
బుధవారం (ఏప్రిల్ 17) రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ (8) త్వరగానే ఔట్ అయి.. డగౌట్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తున్నాడు. ఆ సమయంలో కెమెరామెన్ ఓ లేడీ ఫ్యాన్‌ను కెమెరాలో బంధించాడు. ఆ యువతి స్టేడియంలోని స్క్రీన్‌పై కనిపించింది. అమ్మాయిని చూసిన గిల్.. ఆమె అందానికి పడిపోయినట్లుగా ఓ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. గిల్ రియాక్షన్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read: Google Layoffs 2024: మరోసారి గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు!
ఈ వీడియో చూసిన నెటిజన్స్.. శుభ్‌మన్ గిల్‌పై సెటైర్స్ వేస్తున్నారు. ‘అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయిన శుభ్‌మన్ గిల్’, ‘గిల్.. పడిపోయాడు’, ‘గర్ల్ ఫ్రెండ్ ఉండగా.. ఇవేం పనులు బ్రో’ అంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో గిల్ ప్రేమాయణం నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గుజరాట్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్.. మూడు విజయాలు అందుకుంది.
Wtf ! Gill bro ? 😭😭 pic.twitter.com/oewI3nQ9fO
— Sohel. (@SohelVkf) April 17, 2024