ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ఈ ఫిల్మ్ క్రింజ్ కామెడీతో కితకితలు పెట్టించి మాస్ క్లాస్ ఆడియన్స్‌తో క్లాప్స్ కొట్టించుకుంది. రూ. 300 కోట్లను వెనకేసుకుంది. వెంకీ నెక్ట్స్ త్రివిక్రమ్.. అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ చేసేస్తున్నాడు. మీనాక్షి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, చైతూ 24 చేస్తోంది. మరి ఐశ్వర్య రాజేష్ పరిస్థితి ఏంటి. తన నుంచి సినిమా వచ్చి పది నెలలవుతున్నా అమ్మడు ఇప్పుడేం చేస్తోంది.
Also Read : Shocking : వంద కోట్ల హీరో సినిమా.. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కాకుండానే రిలీజ్ కు రెడీ
సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యంగా ఐశ్వర్య రాజేష్ తన స్టన్నింగ్ ఫెర్మామెన్స్‌తో ఇచ్చిపడేసింది. బావ అంటూ ఓ వైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా మరో వైపు గడుసు పెళ్లాంగా బాగా ఎంటర్టైన్ చేసింది. ఈ సక్సెస్‌తో ఐశ్వర్యకు ఆఫర్లు మాత్రం రావట్లేదు. ఎట్టకేలకు ఈమధ్యే ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీసెంట్‌గా ఈ మూవీ పూజా కూడా చేసుకుని రెగ్యులర్ షూటింగ్‌కి రెడీగా ఉంది. భరత్ దర్శన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. శివం భజే సినిమాను నిర్మించిన గంగా ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా లెవల్లో సినిమాను నిర్మిస్తోంది. మసూదతో పాటు రీసెంట్‌గా హిట్టు టాక్ తెచ్చుకున్న ప్రీ వెడ్డింగ్ షో ఫేమ్ తిరువీర్ మరోసారి భాగ్యంతో జోడీగా కనిపించబోతున్నాడు. తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినా కూడా స్టార్ హీరోలు సినిమాలలో అవకాశాలు రావడం లేదు ఎందుకనో మరి.