NTV Telugu Site icon

Etela Rajender: ప్రజల సమస్యల కోసం ఎక్కడికైనా పోతా.. ఏమైనా చేస్తా..!

Etela

Etela

మల్కాజ్‌గిరి అసెంబ్లీ పరిధిలోని సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పని తీరు ఉండాలి తప్ప స్టాటిక్ గా ఉండకూడదు అని తెలిపారు. ప్రతి చెరువు ఊరికి కన్నతల్లిలాగా పని చేసేది.. మనకు మంచినీళ్లు ఇచ్చింది, రజకులకు చాకిరేవు అయింది, మత్స్యకారులకు మత్స్య సంపద అయింది, చెరువు ఎండిపోతే బతుకు ఎండి పోతుంది కాబట్టి చెరువులను కాపాడుకున్నాము.. కన్నతల్లి పాత్ర పోషించిన చెరువు ఇవాళ దుర్గంధపూరితంగా మారిపోయింది అని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులతో కొట్లాడను అదే విధంగా సమస్యల పరిష్కారానికి మళ్లీ వారి దగ్గరికి వెళ్లే వాడిని అని చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ సిస్టం లేదు.. ఏ సమస్య అయినా ముఖ్యమంత్రికి చెప్పే వాతావరణం ఉండాలి కానీ ఒక రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతుంది ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.

Read Also: Nikhil Gupta : ఉగ్రవాది పన్ను హత్య కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్

నేను మాత్రం ఏ పార్టీ ఎమ్మెల్యే అయిన, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాకున్న ఆలోచన ఒకటే.. ప్రజల సమస్యల కోసం ఎక్కడికైనా పోతా, ఎవరి దగ్గరకైనా పోతా, ఏ దరఖాస్తు అయిన ఇస్తా అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నేను అధికారులను ఒకటే కోరుతున్నాను.. మీకు అన్ని గ్రౌండ్ నుంచి రిపోర్టులు వస్తాయి.. కాబట్టి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి అని కోరారు. నాకు ఈ పదవి కొనుక్కుంటే వచ్చింది కాదు.. మల్కాజ్‌గిరి ప్రజలు ఆత్మను ఆవిష్కరించి పెట్టిన బిక్షగా భావిస్తా.. వారిచ్చిన ఆశీర్వాదంగా భావిస్తానన్నారు. మల్కాజ్‌గిరిలో మీరు గతంలో పడ్డ బాధలు లేకుండా పరిష్కరించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.. గెలిచిన తర్వాత పార్లమెంట్లో ప్రధాని మోడీని కలిశాను.. మల్కాజ్‌గిరి ప్రజలు చూపిన ప్రేమ, ఆదరణ చూసి ముగ్ధుడైన మోడీకి మనపై ఒక ప్రత్యేక అభిమానం ఉంది.. కాబట్టి ఏ సమస్య అయినా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.