Site icon NTV Telugu

Etela Rajender: ఇది అబద్ధమైతే నేను రాజకీయల నుంచి తప్పుకుంటా.. ఈటల సంచలన వ్యాఖ్యలు..

Etela Rajender

Etela Rajender

Etela Rajender: బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారు. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. బీసీ బంద్‌లో భాగంగా జూబ్లీ బస్టేషన్‌ వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని తెలిపారు. పెరియార్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయన్నారు. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి.. ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో 9 వ షెడ్యూల్ లో చేర్చారని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా కేసీఆర్ ఒక సారి సర్వేచేశారు. బీసీ కమీషన్ వేశారు. ఎన్ని వేసిన నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదన్నారు. ఈ ప్రభుత్వం కూడా పేరుకు కమీషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదు.. లెక్కలు తీశారు.. కానీ అవన్నీ తప్పుల తడక అని విమర్శించారు. 52 శాంతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారని ఆరోపించారు.

READ MORE: Rashid Khan: అనాగరికం.. అనైతికం.. పాకిస్థాన్‌ దుశ్చర్యపై రషీద్ ఖాన్ ధ్వజం

తాను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంట అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. “బీసీలు మేమెంతో మాకంత కావాలి. యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నాం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుంది. కుటుంబమే ఏలుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా.. స్వతంత్రం వచ్చినప్పటినుండి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేక పోయారు. ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురున్నారు. ఉన్నా వారికి ఇచ్చిన మంత్రి శాఖలు చిన్నవి. బీసీల పట్ల ముసలికన్నీరు కాకపోతే నామినేటెడ్ పోస్ట్లలో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదు. తెలంగాణలో బీసీను సీఎం చేస్తా అని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. మోడీ క్యాబినెట్ లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. బీజేపీ నిజాయితీని ఎవరు శంకించలేరు. మాదిగ రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చి అమలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. తమిళనాడులో ఏ పద్ధతి ప్రకారం చేశారో అదే పద్ధతిలో చేశారో ఇక్కడ కూడా చెయ్యాలి.” అని ఈటల వ్యాఖ్యానించారు.

Exit mobile version