మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా సీఎం అయ్యేది మాత్రం కేసీఆరేనంటూ వ్యాఖ్యానించాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ఈ కామెంట్స్ చేశాడు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పోలీసులను నమ్ముకున్నారని ఆయన దుయ్యబట్టారు.
Also Read : Ramadan : ఇవాళ నెలవంక కనిపిస్తే రేపు రంజాన్ లేదంటే.. ఇక ఆ రోజే
విపక్ష నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ లొంగకపోతే వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఎదిరించి నిలిచేది ఒక్క బీజేపీ పార్టీ మాత్రమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ఈటల.. కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనివ్వడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా సీఎం అయ్యేది మాత్రం కేసీఆరేనంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పాల్గొనే చేవేళ్ల సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించాడు.
Also Read : What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్దంగా ఉన్నాయని ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమే.. ఆ విషయం ప్రజలకు కూడా తెలుసు అంటూ ఆయన వ్యాఖ్యనించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత బీజేపీ నాయకులపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలే సరైన బుద్ది చెబుతారని ఈటల చెప్పుకొచ్చారు.
