* ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభం..
* ఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ.. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత
* ప్రకాశం జిల్లా: ఇవాళ యర్రగొండపాలెంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం 2 గంటలకు మార్కాపురం నుంచి బయలుదేరి 4.15 గంటలకు యర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయానికి చేరుకోనున్న చంద్రబాబు.. అనంతరం పీహెచ్‌సీ, ఎన్టీఆర్ సర్కిల్, రాళ్లవాగు వంతెన మీదుగా రోడ్డుషో.. ఆ తర్వాత బహిరంగసభ.. వైష్ణవి గార్డెన్‌కు చేరుకుని రాత్రికి బస్సులోనే బస.. రేపు ఉదయం రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబు.
* ప్రకాశం : పుల్లలచెరువు మండలం సుద్దకురవ తండాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..
* తిరుమల: ఇవాళ ఉదయం 10 గంటలకు జులై మాసానికి సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ.. మధ్యహ్నం 3 గంటలకు మే నెలకు సంబంధించిన వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల
* పశ్చిమ గోదావరి: తణుకు నియోజకవర్గంలో మంత్రి కారుమూరి పర్యటన.. అత్తిలి మండలం పాలురులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి కారుమురి ..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో క్రెడాయి ఆధ్వర్యంలో జరిగే ఎక్స్ షోను ప్రారంభిస్తారు. అనంతరం తోటపల్లి గూడూరు మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు
* కడప : నేడు మైదుకూరులో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొననున్న డిప్యూటీ సిఎం అమ్జాద్ బాషా
* తిరుపతి జిల్లా: రేపు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ఆధ్వర్యంలో PSLV C-55 రాకెట్ ప్రయోగానికి సిద్ధం.. ఈ రోజు మధ్యాహ్నం 12.49 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం.. 25.5 గంటల అనంతరం రేపు మధ్యాహ్నం 2 గంటల 19 నిముషాలకు ప్రయోగం.. సింగపూర్ దేశానికీ చెందిన 741 కిలోల TeLEOS-2. 16 కిలోల బరువు కలిగిన Lumilite-4 అనే ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపనున్న ఇస్రో.
* కాకినాడ: నేడు కలెక్టరేట్ లో డీఆర్సీ సమావేశంలో పాల్గొనున్న జిల్లా ఇంఛార్జ్ మంత్రి అప్పలరాజు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో బీజేపీ ఏపీ కొర్ కమిటీ సమావేశం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన భేటీ.. పాల్గొననున్న జాతీయ సంఘటన కార్యదర్శి శివ ప్రకాష్ , కేంద్ర విదేశాంగ మంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి వి. మురళీధరన్, జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ , జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ యాదవ్ , రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు , సీఎం రమేష్ తదితరులు
* తూర్పుగోదావరి జిల్లాలో నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. చాగల్లు మండలం ఊనగట్లలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. కొవ్వూరు 18 వార్డ్ లో గడప గడపకు మా ప్రభుత్వ(100 వ రోజు )కార్యక్రమంలో పాల్గొంటారు
* కర్నూలు: 77వ రోజుకు చేరిన నారా లోకేష్ పాదయాత్ర… ఆదోనిలో పాదయాత్ర చేయనున్న లోకేష్, కడితోట క్రాస్ లో బహిరంగ సభ