Ramadan : ఇవాళ నెలవంక కనిపిస్తే రేపు రంజాన్ లేదంటే.. ఇక ఆ రోజే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ( శుక్రవారం ) నెలవంక కనిపిస్తే శనివారం రంజాన్ పండుగ ఉంటుందని.. లేకపోతే ముస్లింలు ఆదివారం పండుగను జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ప్రతినిధి ముఫ్తీ మహ్మద్ ఖలీల్ అహ్మద్ చెప్పారు. రుహియతే హిలాల్ కమిటీ ( నెలవంక నిర్థారణ కమిటీ ) దీనిపై ఇవాళ స్పష్టతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇస్లాంలో రంజాన్ చివరి శుక్రవారానికి ఎక్కువ ప్రధాన్యం ఇస్తారు. ఈ రోజు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవుని ఆశీస్సులు పొందుతారు.
Also Read : DC vs KKR: కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ త్రిల్లింగ్ విజయం
Also Read
జుమ్మతుల్ విదాను పురస్కరించుకుని హైదరాబాద్ లోని అన్ని మసీదుల్లో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మక్కా మసీద్, పబ్లీక్ గార్డెన్స్ లోని రాయల్ మసీదులో జుమ్మతుల్ విదా ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆయా జోన్ లలో మసీదు పరిసరాలను శుభ్రం చేశారు. శనివారం లేదా ఆదివారం రంజాన్ పండుగ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఈద్గాలలో పండుగ రోజు నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు గురువారం రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్ తెలిపారు.
Also Read : Parvati Nair : ప్యాంట్ బటన్ విప్పి.. సెగలు పుట్టిస్తోందే
అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఈద్గాల కమిటీలకు కూడా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ తెలిపారు. హైదరాబాద్ లోని మీరాలం, మాదన్నపేట్ ఈద్గాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించామన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలోని మైదానాల్లో కూడా రంజాన్ పండుగ నమాజ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించామని రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్ వెల్లడించాడు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!