Site icon NTV Telugu

Etela Rajender: గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన ఎమ్మెల్యే ఈటల

Governor

Governor

తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్మికుల సమస్యలను జిహెచ్ఎంసి కార్మిక సంఘాలతో కలిసి గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్ దృష్టికి తీసుకొని వెళ్ళారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 20 సంవత్సరాల పాటు వెట్టి చాకిరి చేయించుకుని.. పేద బడుగు, బలహీన వర్గాల చెందినవారు అని కూడా చూడకుండా తొలగిస్తున్నారు. ఈ కార్మికులు ఎక్కువమంది దళితులే ఉంటారు. వారిపట్ల జాలీ, దయ చూపించకుండా డ్రైవర్లను,లేబర్లను ఉద్యోగాల నుంచి తీసివేసి రోడ్డు మీద పడవేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మున్సిపల్ కార్మికులను.. ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడం పట్ల వెంటనే కలుగజేసుకొని.. వారి ఉద్యోగాలు, జీవితాలు నిలబడేలాగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారిని కోరినట్లు ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read Also: Minister Mallareddy: కేసీఆర్ ప్రధాని కావాలి.. జోగులాంబను కోరుకున్నా!

తెలంగాణ వచ్చిన వెంటనే వారి ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు అసలే ఉద్యోగాల నుంచి తీసివేయడం దుర్మార్గమని వారు అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్మికులను తొలగిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న ధర్నాలో పాల్గొని మాట్లాడి.. కెసిఆర్ తో చర్చించి వారిని తిరిగి ఉద్యోగాలకు తీసుకొనేలా చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వీరికి అన్యాయం జరగకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసి కార్మిక సంఘం నేతలు గోపాల్ తదితరులతో కలిసి ఈరోజు ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని అందించారు. వారి ఉద్యోగాలు తొలగించకుండా చూడాలని గవర్నర్ తమిళిసైని కోరారు ఈటల రాజేందర్.

Mla Etela, Etela Rajender, Governor Tamilisai, GHMC, Employees, Dalits, Permanent Jobs, Governor, Contract Labour, drivers

Exit mobile version