Site icon NTV Telugu

Etela Rajender : కేసీఆర్‌ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడరు

Etela Rajender Clarity

Etela Rajender Clarity

కేసీఆర్‌ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడరని విమర్శించారు బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి గెస్ట్ లెక్చరర్ లకు అన్యాయం చేస్తుండని, KGBV తో పాటు ఇతర గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్ లకు వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. గెస్ట్ లెక్చరర్స్ రెన్యువల్ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అమలుకు నోచుకోవడం లేదని, కోర్టు తీర్పును అమలు చేయకుండా కేసీఆర్ అపహస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Also Read : 2018 Telugu Collections: సైలెంటుగా కోట్ల కలెక్షన్లు వెనకేసిన బన్నీ వాసు!

అరెస్ట్ చేసిన గెస్ట్ లెక్చరర్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏలుబడిలో ప్రశ్నిస్తే సహించడని, సమ్మెలకు, సంఘాలకు ఆస్కారం లేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ కన్ను హైదారాబాద్ చుట్టూ పక్కల ఉన్న భూముల పై పడ్డదని, వీఆర్‌ఏలు సమ్మె చేస్తే ఉక్కు పాదంతో అణచి వేశారన్నారు. ఇపుడు వాళ్ళను ముంచారని ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ లో ప్రేమకు లోంగుతారు తప్ప దబాయింపు లకు లోంగరని, దేశ వ్యాప్తంగా కరువు లేదు… కాళేశ్వరం వల్లనే భూగర్భ జలాలు పెరగలేదని, ఒక్క టీఎంసీ కి 10 వేల ఎకరాలు పారిన… ఆ పంట విలువ 6 వందల కోట్లు ఉండొచ్చన్నారు.

Also Read : Rashmi: రష్మీని రాత్రికి వస్తావా అని అడిగిన ఆటో రాంప్రసాద్.. ?

కాళేశ్వరం మీద పెట్టిన లక్ష కోట్లు వచ్చాయని కేసీఆర్ అంటున్నారు తెలంగాణ ప్రజలు పువ్వులు పెట్టుకున్నారా కేసీఆర్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీ లు పెండింగ్ లో ఉన్నాయని, VRA లు సమ్మె చేస్తే బెదిరింపులకు దిగారని, VRO లను ముంచి.. ఎక్కడెక్కడో వేశారన్నారు. పంచాయతీ సెక్రటరీ లను బెదిరించి పని చేయించుకుంటున్నారని, ఏపీలో మహిళ సంఘాలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారు… తెలంగాణ లో మూడు వేలు మాత్రమే ఇస్తున్నారని ఆయన అన్నారు.

Exit mobile version