వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం రాణిపేట లో “ప్రజా గోస – బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరు అని అన్నారు. అంతేకాకుండా.. సంక్షేమ పథకాల పేరుతో 25 వేల కోట్లు ఇస్తున కేసీఆర్, తాగిపించి 42 వేల కోట్లు దండుకుంటున్నారు అని విమర్శించారు. వచ్చే పంట కొనుగోలు చేశారో లేదో చెప్పలేదు అన్నారు.
రైతు బంధు చెల్లించకుండా రైతులను ఎగవేత దారులను చేసిన ఘనత కెసిఆర్ కే దక్కింది అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి వారంలోనే పెన్షన్ ఇస్తామని, పెళ్లి పందిరిలోనే కళ్యాణ లక్ష్మి చెక్కు ఇస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని, కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పారు.