NTV Telugu Site icon

Etela Rajender : ఇళ్ళలో ఒక్క వస్తువు కూడా పనికి వచ్చేలా లేవు

Etela Rajender Clarity

Etela Rajender Clarity

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాను వర్షా అతలాకుతలం చేశాయి. వరంగల్‌ జిల్లాలో వరద నీరు పోటెత్తడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా.. కొన్ని చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకొని కొన్ని గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే.. ఇవాళ హనుమకొండ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పది ఫీట్లకు పైగా వరద వచ్చిందని, ఇళ్ళలో ఒక్క వస్తువు కూడా పనికి వచ్చేలా లేవని ఆయన అన్నారు. బియ్యం, పప్పు, ఉప్పు అన్ని తడిచి ముద్ద అయిపోయాయన్నారు ఈటల రాజేందర్‌. గతంలో వరదల సమయంలో కేటీఆర్ తో కలిసి‌ వచ్చి పర్యటించానని, గతంలో కొన్ని ఆక్రమణలను మా ముందే అప్పుడు కూల్చి వేశారన్నారు.

Also Read : Hindu Boy Thrashed: నుదుటిపై తిలకం పెట్టుకున్నాడని హిందూ విద్యార్థిపై దాడి

సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన విమర్శించారు. గతంలో హైదరాబాదులో వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా హైదరాబాద్ వాసులను ఆదుకున్నారో.. అదే విధంగా ఇప్పుడు నాలుగు జిల్లాల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వరద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, నష్టపోయిన వారికి కనీసం 25 శాతం అయినా డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటికి 25వేల రూపాయల చొప్పున, వ్యాపారస్తులకు లక్ష రూపాయల లోపు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి బేషాజాలకు పోకుండా డబ్బులు రిలీజ్ చేయాలని ఆయన అన్నారు.

Also Read : Janhvi Kapoor: బ్లూ లెహంగాలో జాన్వీ కపూర్ హాట్ ట్రీట్.. చూశారా?