NTV Telugu Site icon

Etela Rajender : తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీలు కేసీఆర్ ఎందుకు నెరవేరుస్తలేరు

Etela Rajender Clarity

Etela Rajender Clarity

తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీలు కేసీఆర్ ఎందుకు నెరవేరుస్తలేరని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం అబ్బుర పడే రీతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని కేసీఆర్ చెప్పారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సాధ్యం కాదు…వారికి డబ్బులిస్తే వారే ఇండ్లు కట్టుకుంటారని ఆనాడే చెప్పాము…కానీ కేసీఆర్ మామాట వినలేదని ఆయన వ్యాఖ్యానించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కాయని, నేటి ధర్నా రాజకీయ కార్యక్రమం కాదు… పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని ఆయన మండిపడ్డారు.

Also Read : Janvi Kapoor : పలుచని చీరలో మెరిసిపోతున్న జాన్వీ..

బాట సింగారం లో కట్టిన ఇండ్ల గోడలు పెచ్చులూరి పోయాయి…కానీ అర్హులకు అందలేదని, మేము సందర్శిద్దామని వెళ్తుంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, నన్ను పోలీసులతో అరెస్ట్ చేయించారని ఆయన ధ్వజమెత్తారు. 2023 తర్వాత మీ ప్రభుత్వం ఖతమే… మళ్ళీ కేసీఆర్ కు ఓటు వేయమని పేద ప్రజలు చర్చించుకుంటున్నారని, ఒక్కో ఇంటి నిర్మాణానికి హడ్కో ద్వారా 2 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ డబ్బులు తీసుకున్నావ్ కేసీఆర్ నీ అబ్బ జాగీరా …డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి చూపియ్యి అని ఆయన అన్నారు. ధనిక రాష్ర్టం అయితే ఇండ్లు ఎందుకు నిర్మిస్తలేరు.. హుజురాబాద్ ఎన్నికల్లో పాత్రికేయులకు ఇస్తానన్న ఇండ్లు ఏమయ్యాయి…? కూలి చేసుకున్న పైసలు బార్ షాపులకు వెళ్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తాం. ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్దులకు పెన్షన్ ఇస్తాము. అర్హులైన పేద రైతులకే రైతు బంధు,రైతు భీమా ఇస్తాం’ అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Harirama Jogaiah: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్‌కు హరిరామ జోగయ్య లేఖ