NTV Telugu Site icon

Etela Rajender : తాడిచెర్ల ఓపెన్ కాస్టును ప్రైవేటుపరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్

Etela

Etela

మంచిర్యాల సింగరేణిలో నిరుద్యోగులకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు పోగొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు ఈటల రాజేందర్‌. ఇవాళ ఆయన మంచిర్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. సింగరేణిలో 63,000 మంది కార్మికులు ఉండగా 40 వేల మంది కార్మికులను చేసిన ఘనుడు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. తాడిచెర్ల ఓపెన్ కాస్టును ప్రైవేటుపరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్ అని, ప్రధానమంత్రి మోడీ చాయ్ అన్నాడని, తల్లి ఇళ్లలో పనిచేసేదన్నారు. మోడీ కష్టాన్ని,ధైర్యాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నాడు కాబట్టే దేశ ప్రధానమంత్రి అయ్యాడని ఈటల వ్యాఖ్యానించారు. నేడు సింగరేణి చచ్చుబడిపోయిందని సింగరేణిలో కార్మికుల హక్కుల హక్కులను కాల రాసిన కేసీఆర్‌ అని, నేటికీ సింగరేణిలో ఎన్నికలు జరిపించలేదన్నారు.

Also Read : BJP vs Congress: ‘కమాన్ టీం ఇండియా’ అంటూ బీజేపీ.. జీతేగా “ఇండియా” అంటూ కాంగ్రెస్ కౌంటర్..

సింగరేణిలో 26 వేల కోట్లు చెల్లించి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించు కేసీఆర్, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో మంచిర్యాల చెన్నూరు, బెల్లంపల్లిలో ఒక్క ఓటు పడదు కేసీఆర్ అని ఈటల వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే క్వింటాల్ దాన్యo మద్దతు ధర రూ.3100 ఇస్తామని, తెలంగాణలో కేసీఆర్‌ ఉన్నంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్, అతని కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, లేకపోతే కేటీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అవుతాడే తప్ప వేరే వారికి చోటు లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి బీసీనే చేస్తానని ప్రధాని మోడీ చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అణగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధి లేదని, మంచిర్యాలలో రఘునాద్ కు ఓటు వేయడం అంటే బీసీ ముఖ్యమంత్రి కి ఓటు వేసినట్లేనన్నారు.

Also Read : Raviteja : తనని స్టార్ హీరోని చేసిన ఆ సినిమా కు రవితేజ మొదటి ఛాయిస్ కాదా ..?