NTV Telugu Site icon

Errabelli Dayakar Rao : రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఐటమ్ సాంగ్ లెక్కనే చూస్తారు

Yerrabelli Dayaker Rao

Yerrabelli Dayaker Rao

రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేయడమే కాంగ్రెస్ పార్టీకి ముప్పు అంటూ విమర్శలు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెడితే అక్కడ అది నాశనమేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఐటమ్ సాంగ్ లెక్కనే చూస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు అంతా కిరాయి మనుషులు.. కాంగ్రెస్ నేతలు ఎవరూ రారని ఆయన వ్యాఖ్యానించారు. పాదయాత్ర చేస్తే బ్రేక్ లేకుండా చేయాలి… ములుగులో చేసి నర్సంపేటలో ఎందుకు చేయలేదని, రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి నా కింద పనిచేసినప్పుడు నేను తిట్టేవాన్ని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Transgender Pregnant: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి

రేవంత్ రెడ్డిపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మద్దతుగానా? రెచ్చగొట్టినట్లా? అని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తో మోడీ ఆఫీస్ ను పేల్చాలనే ప్రకటన చేయించు అని ఆయన సవాల్‌ విసిరారు. కారెక్కి పోయే యాత్రను..పాదయాత్ర ఎలా అంటారు? అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇలానే ఉంటే… చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఒక్కో లీడర్ కు ఒక్కో టైప్ పాలన ఉంటుందని, కేసీఆర్ ప్రజల మనిషి అని ఆయన అన్నారు. నక్సలైట్ల ఎజెండాలో చంపుడు ఉండదు.. వాళ్ళ ఎజెండా ప్రజల అభివృద్ధి కోసం ఉంటుందని, గడిలా పాలన కాదు.. ప్రజల పాలన నడుస్తోందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర చదువుతో పాటు దోపిడీలు, దొంగతనాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రేపు హోంమంత్రికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read : PM Narendra Modi: ప్రజలు చేయలేనిది ఈడీ చేసింది.. కాశ్మీర్‌లో ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం