మహబూబాబాద్‌లో రేపు సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్. ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి సీఎం ప్రారంభించనున్న మెడికల్ కాలేజి భవనం.. బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం.. సమీకృత కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించారు నేతలు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణలో గ్రామపంచాయతీల అభివృద్ధి జరగట్లేదు అంటున్న కిషన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డిలు మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ అభివృద్ధి చూపిస్తారా.. తెలంగాణా కంటే ఛాతిష్ ఘాట్.. కర్ణాటల లో మెరుగైన సేవలు అందుతున్నాయి అంటే నేను మంత్రి పదవి వదులుకోడానికి సిద్ధం.. అవసరం అయితే రాజకీయాల నుండి తప్పుకుంటా అని ఆయన మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్.. గుజరాత్ పర్యటనకు సిద్ధమా.. మీరు పాలిస్తున్న రాష్ట్రాల కంటే తెలంగాణని గ్రామ పంచాయతీలు బాగుంటే… మీరు రాజకీయల నుండి తప్పుకోమానను కానీ క్షమాపణ చెప్పండి.. ఈ సవాల్ కి సిద్ధమా అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ మహబూబాబాద్ అభివృద్ధి ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నారు.. మ్యానిఫెస్టోలో పెట్టకున్న మహాబాబూబాద్ కి మెడికల్ కాలేజి ఇచ్చారు.
Also Read : Delhi Airport: ఈ సారి విమానంలో కాదు.. విమానాశ్రయంలో మూత్రం
మహబూబాబాద్ ని జిల్లా చేశారు అన్నారు మంత్రి దయాకర్ రావు. కాంగ్రెస్ పాలిత, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామపంచాయతీ లను, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయితీలను పరిశీలించి బేరుజు వేద్దాం.. తెలంగాణ పంచాయతీల కంటే మెరుగ్గా ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా. గ్రామ సర్పంచ్ లను కాంగ్రెస్, బీజేపీలు రెచ్చగోడుతున్నారు.. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు అన్ని తెలంగాణ కే వస్తున్నాయి.. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బులు మళ్లించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్డం. కేంద్రం నుండి గ్రామ పంచాయితీ లకు 700 కోట్లు రావాలి.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ లకు నెలవారిగా ఇచ్చేవి ఇస్తున్నాం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతూన్నారు.. గ్రామ పంచాయితీ లకు కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో ,రాష్ర్ట ప్రభుత్వం అన్ని నిధులు ఇస్తుంది. గ్రామ పంచాయితీ కి రావలసిన డబ్బుల పై చర్చకు నేను సిద్ధం.. 10 వేల మంది ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఉంటుంది.. కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా వచ్చి కలెక్టరేట్ లను పరిశీలిస్తే బాగుంటుంది.. తెలంగాణ లో అమలు చేస్తున్న పధకాలను చూసి కేంద్రం అమలు చేస్తుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.