EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. PF డబ్బులు విత్‌డ్రా మరింత ఈజీ.. ఇక UPI ద్వారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారులకు ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులు చేస్తూనే ఉంది.. ఆ మార్పులను టెక్నాలజీతో జోడిస్తుంది.. సేవలను మరింత సులువుగా పొందేలా ఏర్పాట్లు చేస్తుంది.. ఇప్పుడు EPFO మరో కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండేది. అయితే త్వరలో యూపీఐ (UPI) ద్వారా పీఎఫ్ నగదును సులభంగా ఉపసంహరించుకునే అవకాశం కల్పించనుంది. EPFO 3.0లో భాగంగా ఈ సదుపాయాన్ని తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరీక్షలు దాదాపు పూర్తయినట్లు సమాచారం.
డిసెంబర్లో UPI సేవలు ప్రారంభం?
EPFO తన సభ్యులకు సేవలను మరింత సులభతరం చేసేందుకు వరుసగా కొత్త మార్పులు చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు ఉపసంహరణ సదుపాయంపై దృష్టి పెట్టింది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ఈ కొత్త సేవను డిసెంబర్ 2026లో ప్రారంభించే అవకాశం ఉంది. ఫిబ్రవరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. EPFO 3.0లో భాగంగా ఈ మార్పులను అమలు చేస్తున్నారు. యూపీఐ ఆధారిత పీఎఫ్ విత్‌డ్రా కోసం అవసరమైన సాంకేతిక వ్యవస్థ సిద్ధమైందని, ట్రయల్స్ దాదాపుగా పూర్తయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది.
Also Read
- RBI Digital Payment Rules: డిజిటల్ పేమెంట్లపై RBI కొత్త రూల్స్.. డబ్బు బదిలీకి గంటలోపు అనుమతి తప్పనిసరి!
- Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
- Stock Market Crash: బ్లాక్ మండే.. స్టాక్ మార్కెట్లో భారీ విధ్వంసం.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
- Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
UPI, ATM ద్వారా పీఎఫ్ నగదు ఉపసంహరణ
కొత్త విధానం అందుబాటులోకి వస్తే పీఎఫ్ ఖాతాదారులకు నగదు ఉపసంహరణ మరింత సులభం కానుంది. యూపీఐ ద్వారా పీఎఫ్ నిధులను తమ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకుని, అనంతరం ఏటీఎం ద్వారా నగదు తీసుకోవచ్చు. దీనివల్ల పేపర్ వర్క్ తగ్గడంతో పాటు క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం కానుంది.
EPFO 3.0లో కీలక మార్పులు
EPFO 3.0లో భాగంగా సంస్థ కొత్త ఐటీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (CBS) కూడా ఉంటుంది. దీని ద్వారా సభ్యులు ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వివిధ సేవలను నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. రాబోయే 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సుమారు 2 బిలియన్ల మంది సభ్యుల డేటాను నిర్వహించేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం EPFO పరిధిలో 360 మిలియన్లకు పైగా క్రియాశీల సభ్యులు ఉన్నారు.
PF ఖాతాలో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చా?
EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 2025 అక్టోబర్‌లో EPFO 3.0 ఫ్రేమ్‌వర్క్‌కు ఆమోదం తెలిపింది. ఏడాదిలోగా ఈ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు ఉపసంహరణకు సంబంధించి పలు అప్డేట్స్ వస్తున్నాయి. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, అర్హులైన సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండవచ్చు. అయితే మొత్తం నగదును ఒకేసారి ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉండదని తెలుస్తోంది. మొత్తంగా EPFO 3.0 అమల్లోకి వస్తే పీఎఫ్ ఖాతాదారులకు నగదు ఉపసంహరణ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా మారనుంది. అయితే UPI సేవ ప్రారంభ తేదీ, 75 శాతం ఉపసంహరణ పరిమితి, అర్హత నిబంధనలపై EPFO అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Red Bra, Blood and Nvidia Flag: చేతిలో బ్రా.. ముఖంపై రక్తపు మరకలు!.. జెన్సన్ హువాంగ్‌పై ట్రంప్ AI పోస్ట్ వైరల్
-
Tollywood Movies Delayed: స్టార్డమ్ vs కంటెంట్.. వాయిదాల పర్వంలో నలుగుతున్న టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్..!
-
EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. PF డబ్బులు విత్‌డ్రా మరింత ఈజీ.. ఇక UPI ద్వారా..!
-
Jwala MK-1: శత్రు డ్రోన్లకు ఇక చెక్! భారత్ జ్వాలా MK-1 పరీక్ష సక్సెస్.. ప్రత్యేకతలు ఇవే!
-
IPL 2027-MI: ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. కెప్టెన్ ఎవరంటే?
ట్రెండింగ్
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..