English Teacher Selling Momos: సోషల్ మీడియా వచ్చాక ఫుడ్ కు సంబంధించిన చాలా వీడియోలు ఫేమస్ అవుతున్నాయి. ఇక ఎవరైనా రుచికరమైన, ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్ అందిస్తుంటే వాటిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు నెటిజన్లు. తమ ఫ్రెండ్స్ ను, బంధువులను తినమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కల్తీలు ఎక్కువయిపోయాయి. పాల నుంచి నూనెలు, పప్పులు, ఉప్పులు.. ఇలా ఏది చూసినా ప్రతి ఒక్కటి కల్తీనే. డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నా దానికి తగినట్లుగా ఎక్కడా హైజీన్ ఫుడ్ దొరకడం లేదు. అందుకే స్ట్రీట్ ఫుడ్ పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా లభిస్తే వెంటనే ఖాళీ చేసేస్తున్నారు జనాలు. ఇక పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మోమోస్ ను అందిస్తానంటూ ఓ ఇంగ్లీష్ టీచర్ మోమోస్ సెంటర్ ను స్టాట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Neeraj Chopra: చరిత్ర సృష్టించిన భారత్.. పసిడి పతకం సాధించిన నీరజ్ చోప్రా
తన ఉద్యోగంతో పాటు ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని అతనికి అనిపించిందో ఏమో కానీ చిన్న టేబుల్ పై మోమోస్ అమ్మడం మొదలు పెట్టాడు ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్. అవి ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా, పరిశుభ్రంగా చేసినవని ఆయన ఇంగ్లీష్ లో వివరిస్తున్నారు. అంతేకాదు ఇవి తింటే దానిలో ఉపయోగించిన పదార్థాల గురించి తప్పకుండా ఆరాతీస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాములుగా మోమోస్ పై పొర కొంచెం మందంగా ఉంటుంది. అయితే ఈ మోమోస్ చాాలా పలచగా చేశామని ఆ వీడియోలో తెలిపారు ప్రొఫెసర్. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ ఈ వీడియోను లైఫ్ విత్ దర్పన్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇంటిలో తయారు చేసిన మోమోస్ ను బాదం చెట్నీ, షెజ్ వాన్ సాస్ తో అమ్ముతున్నారని వీడియో క్యాప్షన్ లో తెలిపారు. అంతేకాకుండా రెండు గంటల్లోనే మోమోస్ అన్నీ ఖాళీ అయ్యాయని పేర్కొన్నారు. ఇక ఈ మోమోస్ లక్నోలోని చతోరి గలిలో సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు విక్రయిస్తున్నారు. ఈ మోమోస్ కు 3.5/5 రేటింగ్ ను ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను కోటి మందికి పైగా చూశారు. ఇక ఆ ఫ్రొఫెసర్ తన భార్యకు సాయం చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రొఫెసర్ కాబట్టే హైజీన్ గా ఉండే ఫుడ్ అందించడానికి ప్రయత్నిస్తున్నారని మరి కొందరు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.