Neeraj Chopra: చరిత్ర సృష్టించిన భారత్.. పసిడి పతకం సాధించిన నీరజ్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న భారత్ కల నెరవేరింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సాధించాడు. అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ జెండా రెపరెపలాడింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా సత్తాచాటాడు.హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చరిత్రను తిరగరాశాడు. స్వర్ణ పతకం గెలిచాడు. గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. జావెలిన్ త్రో ఫైనల్‌లో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు నీరజ్. ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో మారు జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు.
Also Read: Allu Arjun: ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు.. బన్నీ ఏమన్నాడంటే..?
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఇక పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీమ్ జావెలిన్ ను 87.82 మీటర్లు విసిరాడు. ఇక చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకబ్ వడ్ లెజ్క్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని దక్కించుకున్నారు. జాకబ్ వడ్ లెజ్క్ ఈటెను 86.67 మీటర్లు విసిరి బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇక నీరజ్ చోప్రాతో పాటు ఇండియా నుంచి మరో ఇద్దరు ప్లేయర్ లు కూడా ఈ పథకం కోసం పోటీ పడ్డారు. వారిలో ఒకరైన కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. ఇక మరో ప్రత్యర్థి డీపీ మను 84.14 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానంలో నిలిచాడు. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్‌తో పాటు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు నీరజ్ చోప్రా. ఇక 2016లో ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి వెలుగులోకి వచ్చిన నీరజ్ చోప్రా ఈ ఏడేళ్ల కాలంలో దేశం గర్వించేలా ఎన్నో పథకాలు సాధించాడు. 2017 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొని 15వ స్థానంలో నిలిచాడు నీరజ్. ఇక అదే ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన నీరజ్ తరువాత కూడా భారత్ కు స్వర్ణాలు అందించాడు. 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్ లో కూడా జావెలిన్ త్రో లో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని దేశానికి వన్నె తెచ్చాడు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!