కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య వరుస విజయాలను అందుకుంటూ జోరు మీదుంది..గత ఏడాది ఈ అమ్మడు నటించిన కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలు కూడా అనుపమకు మంచి విజయాలు అందించాయి. హ్యాట్రిక్స్ హిట్స్ తో అనుపమ కేరీర్ బ్రేక్స్ లేకుండా దూసుకుపోతుందని అందరు అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. చిన్న హీరోలు తప్ప పెద్ద హీరోలు మాత్రం అనుపమ వైపు కన్నెత్తి చూడలేదు..
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తో డీజే టిల్లు సీక్వెల్ గా తెరకెక్కుతున్న `టిల్లు స్క్వేర్`లో నటిస్తోంది..గత ఏడాది ఆరంభంలో విడుదలైన డీజే టిల్లు సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ లో తెరకేక్కిస్తున్నారు.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నాడు. డబుల్ ఫన్, డబుల్ ఎంటర్‌టైన్మెంట్ తో రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది..
ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.. స్కిన్ షోకు, రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటూ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంది.. అందుకే ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తన విషయాలను షేర్ చేస్తుంది.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతూ లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది.. ఇక ఈ అమ్మడు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో పాటు అనుపమ బోల్డ్ పాత్రలో నటిస్తుందట. ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో.. అనుపమ చేస్తుందని టాక్.. డబ్బుల కోసమే ఈ అమ్మడు ఇలాంటి సినిమాలకు ఈ మధ్య ఒప్పుకుంటుందని వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి..ఈ సినిమాకు అనుపమ ఏకంగా రూ. 2.5 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందని సమాచారం..