Emraan Hashmi : సౌత్ ఫిల్మ్ మేకర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్ హష్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజి’. సాహో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ఈ మూవీ బ్యాక్డ్రాప్ మరియు నటీనటుల ఎంపిక వంటి చాలా విషయాలు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. పవన్ కెరీర్లోనే ‘ఓజి’ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అలాగే పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’లో విలన్ గా నటించి మెప్పించిన ఇమ్రాన్ ఇప్పుడు ఓజీలో నటిస్తుండటంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అయితే తాజాగా అతడు ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓజీ మూవీ షూటింగ్ విశేషాలను పంచుకున్నాడు.
ఈ మేరకు ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ.. ఓజీ మూవీలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా సౌత్ ఫిలిం మేకర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. బాలీవుడ్ తో పోలిస్తే దక్షిణాది దర్శక-నిర్మాతలు చాలా ముందున్నారని, వాళ్లు చాలా క్రమ శిక్షణతో పనిచేస్తారని అన్నారు.అందుకే సౌత్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయంటూ దక్షిణాది మూవీ మేకర్స్ పై ఇమ్రాన్ ప్రశంసలు కురిపించాడు.ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. “బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కంటే సౌత్ ఫిల్మ్ మేకర్స్ చాలా క్రమశిక్షణతో ఉంటారు. సినిమా కోసం వారు ఖర్చు చేసే ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. హిందీ సినిమాల్లో అలా కాదు. సినిమా కంటే కూడా నటీనటులకి ,ఇతర వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అలా సినిమాకు పెట్టే డబ్బు చాలా వృధా అవుతుందనేది నా అభిప్రాయం. అలాగే, వీఎఫ్ఎక్స్ వర్క్ తో పాటు పాత్ బ్రేకింగ్ కథల విషయానికి వస్తే.. దక్షిణాది చిత్రనిర్మాతలు బాలీవుడ్ కంటే ముందున్నారని చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!