Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో చోరీ.. నిందితుడి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపుతోంది. ఈనెల 7న టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ ఈ చోరీకి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో విధులు ముగించుకుని బయటకు వచ్చే సమయంలో పరకామణిలో ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ రూ.20వేలు నగదు చోరీ చేసినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు
మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి హుండీల లెక్కింపులో కొందరు చేతివాటం చూపించారు. మహామండపం బాత్రూమ్లో 12 తులాల బంగారాన్ని మంగళవారం నాడు ఆలయ సిబ్బంది గుర్తించారు. సోమవారం చేపట్టిన హుండీల లెక్కింపులో పాల్గొన్న ఉద్యోగులే ఈ బంగారాన్ని దాచి ఉంటారనే అనుమానంతో ఆలయ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దీంతో ఈ చోరీపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్‌లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్‌కు.!
- OTR: కాపు ఓట్ బ్యాంక్ వైసీపీకి దూరమైందా.? లెక్కలు ఏం చెబుతున్నాయంటే.?
తాజావార్తలు
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?