Andhra Pradesh: సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర అధ్యక్షులు జానీ పాషా తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం నాడు కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ అయినట్లు చెప్పారు. జూన్ 30లోగా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. విజయవాడలో సీఎం జగన్‌కు కృతజ్ఞత సభ నిర్వహిస్తామని జానీ పాషా పేర్కొన్నారు.
కాగా ప్రొబేషన్ ఖరారు చేసేందుకు అర్హులైన ఉద్యోగుల జాబితాలు పంపాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సోమవారం లేఖలు రాసింది. ఉద్యోగుల ప్రొబేషన్ 2022 జూన్ నాటికి ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున సంబంధిత ప్రభుత్వ శాఖల విభాగాల అధిపతుల సమాచారం ఆధారంగా అర్హుల జాబితాలు ఈనెల 16లోగా పంపాలని సచివాలయాల శాఖ సంచాలకులు షన్మోహన్ కలెక్టర్లకు సూచించారు. ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో 12,901 ఏఎన్‌ఎంలు, 11,636 ఇతర ఉద్యోగులు ఉత్తీర్ణులైన విషయాన్ని కలెక్టర్లకు రాసిన లేఖలో షన్మోహన్ ప్రస్తావించారు. తాము పంపిన నమూనా ఆధారంగా కలెక్టర్లు సమాచారం పంపాలని ఆయన కోరారు.
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్‌లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్‌కు.!
- OTR: కాపు ఓట్ బ్యాంక్ వైసీపీకి దూరమైందా.? లెక్కలు ఏం చెబుతున్నాయంటే.?
Asani Cyclone: దిశ మార్చుకున్న ‘అసని’.. ఏపీకి తప్పనున్న ముప్పు
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?