ప్రముఖ వ్యాపారవేత్త, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఖర్చులు తగ్గించుకునే పనిలో పలు నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్ తాజాగా న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసి వేశారు. ఇండియాలోని మూడు ఆఫీసుల్లో రెండింటిని మూసివేసిన సంస్థ.. సిబ్బందిని ఇంటినుంచే పనిచేయమని కోరింది. బెంగళూరు కార్యాలయం ప్రస్తుతం యథాతథంగా కొనసాగనుందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే 90 శాతం ఉద్యోగులను తొలగించిన ట్విట్టర్.. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్ని మూసేయడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిలో 90శాతం మందిని తొలగించిన విషయం తెలిసిందే.
Also Read: Anderson-Broad: అండర్సన్-బ్రాడ్ జోడీ అదిరిపోయే రికార్డు.. 1000 వికెట్లతో!
2022లో ఉద్యోగుల భారీ తొలగింపుల తరువాత మస్క్ ఇప్పుడు ఆఫీసుల మూతకు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగాఉద్యోగుల తొలగింపులతోపాటు, కార్యాలయాలను మూసివేస్తున్నారు. ఈ సంస్థ భారతీయ మార్కెట్‌కు ప్రాధాన్యతనిస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. బెంగళూరులో కార్యాలయాన్ని ట్విట్టర్ కొనసాగించడానికి కారణం..ఇది ప్రధానంగా ఇంజనీర్లతో పని చేస్తుందని సమాచారం.
Also Read: Zomato: డెలివరీ బాయ్స్ కోసం జొమాటో రెస్ట్ షెల్టర్స్.. ఇక ఆ ఇబ్బందులకు చెక్!