కస్టమర్ల సౌకర్యం కోసం ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకొస్తూ ఉంటుంది ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో. తాజాగా ఆ ఫుడ్ డెలివరీ చేస్తున్న ఏజెంట్స్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డర్స్ స్వీకరించడం, డెలివరీ చేయడం.. ఇలా బిజీ షెడ్యూల్‌తో ఫుడ్ డెలివరీ ఏజెంట్స్ పనిచేస్తుంటారు. కాస్త విశ్రాంతి తీసుకుందామన్న సమయం దొరకదు. టైమ్ దొరికినా ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ జొమాటో డెలివరీ ఏజెంట్ల కోసం ‘రెస్ట్ పాయింట్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Also Read: Anderson-Broad: అండర్సన్-బ్రాడ్ జోడీ అదిరిపోయే రికార్డు.. 1000 వికెట్లతో!
కేవలం జొమాటో ఏజెంట్స్ మాత్రమే కాకుండా ఇతర సంస్థలకు చెందిన డెలివరీ బాయ్స్ కూడా ఈ రెస్ట్ షెల్టర్లను ఉపయోగించుకోవచ్చని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. గురుగ్రామ్‌లో ఇప్పటికే రెండు రెస్ట్ పాయింట్లు ఏర్పాటు చేశామని, త్వరలోనే మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రెస్ట్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.ఈ షెల్టర్లలో తాగునీరు, ఫోన్ ఛార్జింగ్, హై-స్పీడ్ ఇంటర్నెట్, వాష్‌రూమ్‌లు, 24×7 హెల్ప్‌డెస్క్, ఫస్ట్ ఎయిడ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా విధులు నిర్వర్తిస్తున్న డెలివరీ ఏజెంట్స్ సంక్షేమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు దీపిందర్ తెలిపారు. ఈ రెస్ట్ పాయింట్స్ ఏర్పాటుతో ఏజెంట్లు అలసట నుంచి విముక్తి పొంది శారీరకంగా, మానసికంగా ఉపశమనం పొందుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read: Chetan Sharma Resigns: స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా