ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పలు మార్పులు తీసుకొచ్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎక్స్‌లో పోస్టులకు ఇక నుంచి ఛార్జ్ విధించవచ్చని ప్రకటించారు. కొత్త యూజర్లు చేసే పోస్ట్‌కు చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావొచ్చని స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత వెల్లడించారు. బాట్స్ సమస్య నివారణకు ఇది తప్పదనే సంకేతమిచ్చారు. ఎక్స్ డైలీ న్యూస్ ఖాతా నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. మస్క్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
బాట్‌ల సమస్య నివారణ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న కృత్రిమ మేధ విధానాలు సమర్థంగా పనిచేయట్లేదని ఎలాన్ మస్క్ తెలిపారు. క్యాప్చా వంటి పరీక్షలను చాలా సులువుగా అధిగమించగలుగుతున్నాయన్నారు. కొత్త యూజర్లు ఫీజు చెల్లింకపోయినా ఎక్స్‌లో పోస్ట్ చేసేందుకూ అవకాశం ఇస్తారా? ఒకరు అడగ్గా.. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కనీసం మూడు నెలలు వేచి చూడాలన్నారు. అయితే ఈ కొత్త విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుందని మాత్రం మస్క్ వెల్లడించలేదు.
Also Read: Ramdev Baba: మీరు అమాయకులు కాదు.. రామ్‌దేవ్‌ను మరోసారి మందలించిన సుప్రీంకోర్టు!
గత సంవత్సరం అక్టోబర్ నుంచే న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో కొత్త వినియోగదారుల నుండి సంవత్సరానికి ఒక డాలర్ వసూలు చేయడంను ఎలాన్ మస్క్ ప్రారంభించారు. ఈ దేశాలకు చెందిన కొత్త యూజర్లు ఎక్స్‌లో పోస్ట్‌ను చూడగలరు. కానీ వీరికి రిప్లై, రీపోస్ట్, కొత్త పోస్ట్ రాయడం వంటి ఆప్షన్లు ఉండవు. ఈ విధానాన్నే ఇప్పుడు ఇతర దేశాలకూ విస్తరించే యోచనలో మస్క్ ఉన్నారు.