Elon Musk: డిగ్రీ లేకున్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వొచ్చంటున్న మస్క్
- ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం
- డిగ్రీ లేకున్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వొచ్చంటున్న మస్క్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నియామక ప్రక్రియలో సంచలన మార్పులు చేసి, “ఎవ్రీథింగ్ యాప్” కోసం టాలెంట్ ఉన్న వ్యక్తులను ఆహ్వానించారు. ఈ నియామక ప్రక్రియలో డిగ్రీల అవసరం, గత అనుభవం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మీరు ఏ స్కూల్‌కు వెళ్లారో కూడా తెలపాల్సిన అవసరం లేదని.. కేవలం మీ కోడ్ చూపిస్తే చాలని మస్క్ తెలిపారు. మాములుగా, మస్క్ ప్రతిభకు పెద్ద పీట వేయడం కొత్తేమీ కాదు. 2014లోనే టెస్లాలో ఉద్యోగం పొందడానికి యూనివర్సిటీ డిగ్రీ అవసరం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రతిభావంతులైన వ్యక్తులు తమ నైపుణ్యాలను చూపిస్తే చాలు, ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరం లేదని మస్క్ నమ్ముతారు.
Also Read: Ind Vs Eng Series: ధనాధన్ ఇన్నింగ్స్‌లకు వేళాయే.. కోల్‌కతాకు చేరుకున్న టీమిండియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు
Also Read
నిజానికి మస్క్ చదువు విధానంపై తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పటి విద్యా విధానం బట్టీ పట్టడంపైనే దృష్టి పెట్టి, నిజ జీవిత సమస్యలను పరిష్కరించగల నైపుణ్యాలను పెంపొందించడంలో విఫలమవుతోందని మస్క్ అభిప్రాయపడ్డారు. అందుకే తన కంపెనీలు టెస్లా, స్పేస్ఎక్స్ ఇప్పుడు X కూడా డిగ్రీల కంటే నైపుణ్యాలను గుర్తించి నియామకాలను చేపడతాయని మరోమారు తెలిపారు. ఈ నేపథ్యంలో Xను కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా కాకుండా.. పేమెంట్స్, మెసేజింగ్, ఈ-కామర్స్, మల్టీమీడియా వంటి అనేక సేవలను ఒకే వేదికగా అందించాలనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. చైనాలో బాగా ప్రాచుర్యం పొందిన వీచాట్ మాదిరిగా Xను గ్లోబల్ హబ్‌గా మార్చాలని ఆయన భావిస్తున్నారు.
Also Read: Mahesh Babu : 20 నిమిషాల వైల్డ్ ఫైర్ .. డూప్ లేకుండా మహేష్ బాబుతో షూట్‌కు జక్కన్న ప్లాన్?
2025 పూర్తి అయ్యే నాటికి X మనీ (పేమెంట్ సర్వీస్), X టీవీ (స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్) వంటి ఫీచర్లను ప్రవేశపెట్టే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే, 2024లో ప్రవేశపెట్టిన AI చాట్‌బాట్ గ్రోక్లో సరికొత్త మార్పులను తీసుకురానున్నారు. ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, ఆయన తన వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి, ఎలాన్ మస్క్ మరోసారి తన ఆలోచనలతో పరిశ్రమల రూపు మారుస్తున్నారు. చర్చనీయాంశమైనా, ఆయన నిర్ణయాలు మాత్రం కొత్త ఆవిష్కరణలకు దారితీస్తున్నాయి.
తాజావార్తలు
-
El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
-
Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి – నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
-
Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
-
HYDRAA : హైడ్రాపై హైకోర్టు ఫైర్.. కమిషనర్ బదిలీకి ఆదేశాలు.!
-
FIFA World Cup: ప్రైవేట్ సంస్థలకు వరల్డ్ కప్ అమ్మకం.. ఫిఫా సంచలన ప్లాన్..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!