Ind Vs Eng Series: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 22 నుండి ప్రారంభం కానుండగా.. ఈ సిరీస్‌కు సంబంధించిన ఇరు జట్లను ఇప్పటికే ప్రకటించారు. టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా.. ఇంగ్లండ్ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వ బాధ్యతలను చేపట్టారు. ఇక సిరీస్‌లోని తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మొదలు కానుంది. ఇకపోతే, భారత్ జట్టు ఇంగ్లండ్ పై టీ20 రికార్డుల కాస్త మెరుగైన స్థితిలో ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 24 టీ20 మ్యాచ్‌లు జరిగగా, అందులో 13 మ్యాచ్ లలో భారత్ విజయాలను అందుకోగా, 11లో ఇంగ్లండ్ విజయం సాధించి.
Also Read: Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాలో అట్రాక్షన్గా పూసలమ్మాయి..అసలు మైండ్లోంచి పొవట్లేదుగా!
ఇక సిరీస్ ఆడేందుకు ఇరు జట్లు శనివారం (జనవరి 19) కోల్‌కతా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్‌లో పాల్గొంటున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ కూడా కోల్‌కతాకు చేరుకున్నాడు. ఆ తర్వాత, జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టులోని మిగతా సభ్యులు దుబాయ్ నుండి నేరుగా కోల్‌కతా చేరుకున్నారు. ఛాంపియన్స్ ట్రోపీలో అవకాశం లభించని యువ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మలు కూడా ఈ సిరీస్ కోసం కోల్‌కతాకు చేరుకున్నారు. వీరితోపాటు టీమిండియా యువ ఆటగాళ్లు రింకు సింగ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు అందరూ కోల్‌కతాకు చేరుకున్నారు. ముఖ్యంగా సుమారు 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వస్తున్న మహమ్మద్ షమీ కూడా కోల్‌కతా చేరుకున్నారు. ఇక కోల్‌కతా మ్యాచ్‌కు ముందు, ఇరు జట్లు మూడు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటాయి. ఇక ఈ టీ20 సిరీస్ లో పాల్గొనే ఇరుజట్ల ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Yoga Tips: క్రమం తప్పకుండా పది నిముషాలు ఈ యోగా ఆసనాలు చేస్తే చాలు.. అధిక కొవ్వు ఇట్టే మాయం
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమ్మీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్.
🚨 England Cricket Team have Reached India for the 5 T20s and 3 ODIs.#INDvsENG pic.twitter.com/OPoiem5GYg
— Sheeza Khan (@Pmln_gulf92) January 18, 2025
ఇంగ్లండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, రెహాన్ అహ్మద్, హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, జామీ స్మిత్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న టీ20 సిరీస్ షెడ్యూల్ ఇలా..
జనవరి 22 – తొలి టీ20 మ్యాచ్ – కోల్‌కతా
జనవరి 25 – రెండో టీ20 మ్యాచ్ – చెన్నై
జనవరి 28 – మూడో టీ20 మ్యాచ్ – రాజ్‌కోట్
జనవరి 31 – నాలుగో టీ20 మ్యాచ్ – పూణె
ఫిబ్రవరి 2- ఐదవ టీ20 మ్యాచ్ – ముంబై.