Site icon NTV Telugu

Elon Musk: కొత్త పార్టీ ప్రకటనతో మస్క్‌కు ఎదురుదెబ్బ.. 24 గంటల్లో రూ. 1.31 లక్షల కోట్లకు పైగా నష్టం..!

Elon Musk

Elon Musk

జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు. దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. మరోవైపు, ట్రంప్‌తో కొనసాగుతున్న వివాదం, కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత 24 గంటల్లో, మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ క్రాష్ అయ్యింది. దీని కారణంగా 15.3 బిలియన్ డాలర్లు (రూ. 1.31 లక్షల కోట్లకు పైగా) నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా, ఎలాన్ మస్క్ నికర విలువ తగ్గుతూ వస్తోంది.

READ MORE: Perni Nani: జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు పెడతారా?

అయితే, ట్రంప్‌తో జరిగిన గొడవ మధ్య, ఎలోన్ మస్క్ నిరంతరం భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. సంపద క్రమంగా తగ్గుతోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లోని డేటాను ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద కేవలం 24 గంటల్లో 15.3 బిలియన్ డాలర్లు తగ్గింది. అతని నికర విలువ 346 బిలియన్ డాలర్లకు (మస్క్ నెట్‌వర్త్ ఫాల్) పడిపోయింది. ఈ తాజా పతనంతో 2025 సంవత్సరంలో మస్క్ నష్టం 86.7 బిలియన్ డాలర్లకు పెరిగింది.

READ MORE: Hyderabad Bomb Threat: హైదరాబాద్‌లో ముగిసిన తనిఖీలు.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు!

ఎలాన్ మస్క్ నికర విలువ తగ్గడానికి టెస్లా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌లో మార్పు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మస్క్ తన రాజకీయ ప్రవేశం తర్వాత తన వ్యాపారంపై దృష్టి పెట్టగలరా? అని కంపెనీ పెట్టుబడిదారులు ఆలోచించారట. అందుకే టెస్లా షేర్లపై ప్రభావం కనిపించదని చెబుతున్నారు. టెస్లా షేర్లు పతనం కావడంతో అమెరికా స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది. డొనాల్డ్ ట్రంప్ 14 దేశాలపై కొత్త సుంకాలను విధించిన మరింత పతనం కనిపిస్తోంది. డౌ జోన్స్ 422.17 పాయింట్లు తగ్గి 44,406.36కి చేరుకోగా, S&P500 ఇండెక్స్ 49.37 పాయింట్లు తగ్గి 6,229.98 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌లో కూడా తీవ్ర క్షీణత కనిపించింది. 188.59 పాయింట్ల పతనంతో 20,412.52 వద్ద ముగిసింది.

Exit mobile version