Site icon NTV Telugu

Elon Musk: జో బిడెన్ వ్యోమగాములను భూమిపైకి తీసుకురానివ్వలేదు?.. కారణం చెప్పిన మస్క్..

Elon Musk

Elon Musk

స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లతోపాటు, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ ‌హేగ్, రోస్‌కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్‌లు భూమి మీదకు సురక్షితంగా వచ్చారు. దీంతో, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మిషన్ విజయవంతంగా పూర్తయింది. వీరి రాకపై స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఈసందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ అధ్యక్షుడు జో బిడెన్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరు వ్యోమగాములను తిరిగి
తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్ గతంలో ఆఫర్ చేసిందని, కానీ రాజకీయ కారణాల వల్ల బైడెన్ ప్రభుత్వం ఈ ఆఫర్‌ని తిరస్కరించిందని మస్క్ తెలిపారు.

READ MORE: Sudiksha Missing: సుదీక్ష తల్లిదండ్రుల నిర్ణయంతో అనుమానితుడికి విముక్తి

“మేము ముందుగానే వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి ముందుకొచ్చాం. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించాం. నిజానికి వ్యోమగాములు అక్కడ 8 రోజులు మాత్రమే ఉండాల్సి ఉంది. వారు దాదాపు 10 నెలలుగా అక్కడే ఉండాల్సి వచ్చింది. పరిస్థితులు ఎలా ఉన్న కొన్ని నెలల తర్వాత స్పేస్‌ఎక్స్ వ్యోమగాములను తీసుకురాగలిగి ఉండేది. మేము ఈ ప్రతిపాదనను బిడెన్ పరిపాలనకు చేసాం. కానీ రాజకీయ కారణాల వల్ల దానిని తిరస్కరించారు.” అని ఎలాన్ మస్క్ చెప్పారు.

READ MORE: MLA Kunamneni: ఈ బడ్జెట్ నాలుగేళ్లకు పెట్టరా.. ఒక్క ఏడాదికి పెట్టరా తెలియదు..

Exit mobile version