Bhatti Vikramarka : విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుడికి కోటి రూపాయల బీమా చెక్కు ఇవ్వడం దేశంలోనే ఇదే తొలిసారి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్‌లో ఎన్‌పీడీసీఎల్ పరిధిలో పనిచేసిన జోగు నరేశ్ కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును, ఆయన భార్యకు విద్యుత్ శాఖలో కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, “ఇలాంటి గొప్ప నిర్ణయం కేవలం సీఎం…
విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ అధికారులపై, సిబ్బంది పై దాడి చేయడం, విధులు నిర్వర్తించకుండా అడ్డగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ హెచ్చరించారు. నిన్న (గురువారం) బంజారా హిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీ నగర్ లో జరిగిన సంఘటనలో గాయపడిన సిబ్బంది గణేష్, శ్రీకాంత్ మరియు భాస్కర్లను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య పరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని సర్కిల్ సూపెరింటెండింగ్…