NTV Telugu Site icon

Tragedy: బైక్‌పై విద్యుత్ తీగలు పడి భార్యాభర్తలు సజీవ దహనం..

Current Shock

Current Shock

యూపీలోని బదౌన్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో.. డేటాగంజ్-బడాయూన్ రహదారిపై హైటెన్షన్ లైన్ తెగిపడి బైక్‌పై వెళుతున్న దంపతులపై పడింది. దీంతో.. విద్యుత్ ఘాతుకానికి గురై భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ కూడా పూర్తిగా కాలిపోయింది. ఎలాగోలా ప్రజలు హైటెన్షన్ లైన్‌ను తొలగించారు. కాని అప్పటికే వారి శరీరాలు బాగా కాలిపోయాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. మరోవైపు ప్రమాద సమాచారం అందిన వెంటనే మృతుల కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Read Also: Paris Olympics 2024: కాంస్య పతకాన్ని కోల్పోయిన ధీరజ్, అంకిత జంట..

వివరాల్లోకి వెళ్తే.. డేటాగంజ్ కొత్వాలి ప్రాంతంలోని దుధారి గ్రామానికి చెందిన దేవ్‌పాల్ సింగ్ (52) శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన భార్య మీనా సింగ్ (49)తో కలిసి బైక్‌పై నగరం నుంచి తన గ్రామానికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో దేవపాల్ సింగ్ హెల్మెట్ ధరించాడు. అతని బైక్ మూసాజాగ్ గ్రామం సమీపంలోకి చేరుకోగానే.. ఒక్కసారిగా హైటెన్షన్ లైన్ తెగి వారిపై పడడంతో బైక్ పై వెళ్తున్న దంపతులు కిందపడ్డారు. వారికి కరెంటు షాక్ రావడంతో దంపతులు బైక్‌తో పాటు కాలిపోయి లేవలేకపోయారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

Read Also: Shubhanshu Shukla: రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లబోతున్న రెండో భారతీయుడు ఇతనే..

బైక్‌ కూడా మంటల్లో కాలిపోయింది. అనంతరం వారి మృతదేహాలు కూడా కాలిపోయాయి. కాలిపోతున్న మృతదేహాలను చూసి స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజల సాయంతో స్తంభాలపై ఉన్న హైటెన్షన్‌ లైన్‌ను తొలగించారు. అప్పటికి దంపతుల మృతదేహాల కాళ్లు కాలిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

Show comments