NTV Telugu Site icon

Electric Bus For Tirumala: తిరుమలకు గేరు లేని బండి..హంగులెన్నో తెలుసాండీ?

Tml Bus 1

Tml Bus 1

కలియుగ వైకుంఠం అంటేనే అదో అనుభూతి.. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్షలాదిమంది భక్తులు ఆమలయప్పస్వామిని కనులారా వీక్షించి తరిస్తారు. నమో వేంకటేశాయ అనే మంత్రం విని పులకాంకితులు అవుతారు. త్వరలో తిరుమల బ్రహోత్సవ శోభతో అలరారనుంది. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ ఒకటి తిరుమలకు రానుంది.

రైల్ రన్ కోసం ప్రస్తుతానికి అలిపిరి డిపోకు వచ్చింది ఏసీ విద్యుత్తు బస్సు. దీనిని అత్యాధునిక సాంకే తిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందులో గేరు వ్యవస్థ ఉండదు. డ్రైవర్ సీటు వద్ద బ్రేకు, ఎక్స్ లేటర్ మాత్రమే ఉంటాయి. వైఫైతో పాటు డిస్ ప్లే స్క్రీన్, వాకీ టాకీ, ముందు వెనుక సీసీ కెమెరాలు ఉన్నాయి. ఛార్జింగ్ పోర్టుకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌పై ఇస్లామిక్ దేశాల ప్రేలాపన.. సొంతింటిని చక్కదిద్దుకోండని భారత్ ఘాటు సమాధానం

ఈ ఎలక్ట్రిక్ బస్సుకి పూర్తిగా అద్దాలు మూసి ఉండటంతో ప్రతి విండో వద్ద అత్యవసర ఏర్పాట్లు చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఈ బస్ ని ఆసక్తిగా తిలకించారు. డిపోలో ఛార్జింగ్ పాయింట్ వ్యవస్థ నిర్మాణంలో ఉంది. ఇప్పటికే ఛార్జింగ్ పాయింట్ బాక్సులు డిపోకు చేరుకున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే సుమారు 240 కిలోమీటర్లు వరకు ఛార్జింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 21న ప్రారంభం చేయనున్నట్లు అలిపిరి డిపో మేనేజర్ హరిబాబు తెలిపారు.

మరోవైపు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలుకు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. గరుడ సేవకు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు. బ్రహ్మోత్సవాలకు 7 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల భద్రతపై త్వరలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం వుందని తెలుస్తోంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇఓ ధర్మారెడ్డితో సమావేశం నిర్వహించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.

Read Also: Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. ఏ రోజు ఏ వాహన సేవ..?

Show comments