Elections Schedule: మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్..!
మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. ఎంపీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గత కొన్నిరోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసింది. అందులో భాగంగా రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Read Also: TS News: రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం..
Also Read
దేశ వ్యాప్తంగా లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సింది. వీటితోపాటు జమ్మూ కాశ్మీర్ లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ సమాయత్తం అయింది. ఇందుకోసం మార్చి 8, 9వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కావాలని ఈసీ భావిస్తోంది. ఆ తర్వాత మార్చి 12, 13వ తేదీల్లో ఎలక్షన్ కమిషన్ బృందం జమ్మూకాశ్మీర్ లో పర్యటించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఎన్నికల నిర్వహణపై ఈసీ ఒక అంచనాకు రానుంది. ఈ టాస్క్ ముగిసిన తర్వాత మార్చి రెండోవారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
Read Also: Congress vs SP: కాంగ్రెస్-ఎస్పీ మధ్య చర్చలు విఫలం.. మూడు సీట్ల విషయంలోనే..!
గత లోక్‌సభ షెడ్యూల్‌ను ఈసీ మార్చి 10 ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!