హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైన ఎలక్షన్ కమీషన్ ఆధ్వన్యంలో ఓటర్ అవేర్నెస్ కంపెయిన్ నిర్వహిచింది. ఈ సందర్భంగా.. వాక్తన్, సైక్లింగ్ కార్యక్రమం చేపట్టింది. సైక్లింగ్ టు ఓటు- వాక్ టు ఓటు పేరుతో వాక్తన్ కంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండేలు పాల్గొన్నారు. ఇక, రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సైబరాబాద్ సీపీ స్టీపెన్ రవీంద్ర, ఉన్నత అధికారులతో పాటు పెద్ద ఎత్తున యువతీయువకులు పాల్గొన్నారు.
Read Also: AP High Court: నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
ఈ కంపెయిన్ కు భారీ సంఖ్యలో సైక్లిస్ట్ లు, వాకర్స్ పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఈ అవగాహన కార్యక్రమం.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ముందు ఓటు హక్కు వినియోగించుకోవాలని నాటకం ద్వారా చేసి విద్యార్థులు చూపించారు. సైక్లిస్ట్ లతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ముచ్చటించారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రతిజ్ఞ చేయించారు. జెండా ఊపి వాక్తన్ ను చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ ప్రారంభించారు. వాక్తన్ కార్యక్రమంలో స్వయంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అండ్ టీమ్ పాల్గొన్నారు.