Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక కొత్త జంటను దర్శకుడు అజయ్ భూపతి చాలా ఫ్రెష్‌గా చూపిస్తున్నారట. ఈ సినిమా ప్రస్తుతం తుది దశ షూటింగ్‌లో ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో చిత్ర యూనిట్ ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నప్పటికీ, చిత్ర యూనిట్ ఒక క్వారీలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. హీరో జయకృష్ణ మరియు విలన్ అజయ్ గ్యాంగ్ మధ్య జరిగే ఈ ఇంటెన్స్ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. తన మొదటి సినిమాతోనే మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని జయకృష్ణ చాలా కష్టపడుతున్నారు. డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తున్నట్లు సమాచారం. మనకు తెలిసి అజయ్ భూపతి సినిమాల్లో రా అండ్ రస్టిక్ యాక్షన్ ఉంటుంది. ‘శ్రీనివాస మంగాపురం’లో కూడా అదే స్థాయి ఎమోషన్, యాక్షన్ ఉండబోతున్నాయని టాక్. ప్రస్తుతం జరుగుతున్న ఈ క్వారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తయితే టాకీ పార్ట్ దాదాపు కంప్లీట్ అయినట్టే. దీని తర్వాత మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి, సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!