NTV Telugu Site icon

Heavy Rains: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. అల్లూరి ఏజెన్సీ ఘాట్‌లలో వాహన రాకపోకలపై ఆంక్షలు

Heavy Rains

Heavy Rains

Heavy Rains: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అల్లూరి ఏజెన్సీ ఘాట్‌లలో వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. నేడు సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఘాట్‌లలో చెట్లు, కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. పాడేరు, చింతపల్లి, అరకు, రంపచోడవరం, చింతూరు, ఎస్ కోట ఘాట్ రోడ్‌లో ప్రయాణంపై నిషేధం విధించారు.

Read Also: Rammohan Naidu: రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరం.. నిధులను ఏపీకి రప్పిస్తాం..

ఆలయ గోపురాన్ని తాకిన వరద నీరు
ఇదిలా ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని దేవీపట్నంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం గండి పోచమ్మ ఆలయం గోపురం వరకు గోదావరి వరద నీరు పోటెత్తింది. ఇప్పటికే దర్శనాలను అధికారులు నిలిపివేశారు. గుడి ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులకు గోదావరిలోకి చేపల వేటకు వెళ్లవద్దని వేటగాళ్లకు అధికారులు హెచ్చరించారు. పోచమ్మ గుడి ఆవరణలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది.

Show comments