Site icon NTV Telugu

ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ గ్యాంగ్‌లో ఊహించని ట్విస్ట్.. ఆ కీలక నటుడు అవుట్?

Ene2

Ene2

తెలుగు యూత్ ఫుల్ సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) ముందు స్థానంలో ఉంటుంది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లవుతున్నా, ఇప్పటికీ ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఈ సినిమా ముచ్చట్లు ఖచ్చితంగా వస్తాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ఈ క్లాసిక్ బడ్డీ కామెడీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే, ఈ పార్ట్-2 గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి భాగంలో వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉప్పు (వెంకటేష్ కాకుమాను)తో పాటు కార్తీక్ పాత్రలో సాయి సుశాంత్ రెడ్డి నటించిన సంగతి తెలిసిందే. తన పెళ్లి చుట్టూనే పార్ట్-1 కథ అంతా నడుస్తుంది.

Also Read : Malavika Mohanan : ప్రొడ్యూసర్లు నమ్మితే.. హీరోయిన్లు కూడా రికార్డులను తిరగరాస్తారు

అయితే, లేటెస్ట్ బజ్ ప్రకారం పార్ట్-2లో సాయి సుశాంత్ ఉండటం లేదట. ఆయన స్థానంలో మరో కొత్త నటుడిని తీసుకోవాలని తరుణ్ భాస్కర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆ నలుగురి మధ్య ఉండే కెమిస్ట్రీనే మెయిన్ ప్లస్ పాయింట్. అలాంటిది ఇప్పుడు ఒక నటుడు మారిపోతే ఆ మేజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా? అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సాయి సుశాంత్ ఎందుకు తప్పుకుంటున్నారు? ఆయన స్థానంలో వచ్చే ఆ కొత్త నటుడు ఎవరు? అనే విషయాలపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. ఏదేమైనా ‘ఈ నగరానికి ఏమైంది 2’ కోసం ఎదురుచూస్తున్న ఆడియెన్స్‌కి ఇదొక ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి.

Exit mobile version