ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఓ కేసు వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ గోరఖ్‌పూర్‌కు ఆనుకుని ఉన్న ఖుషీనగర్‌లో నకిలీ నోట్ల వ్యాపారం బట్టబయలైంది. ఈకేసును చేధించిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ సంతోష్ కుమార్ మిశ్రా కూడా వార్తల్లో నిలిచారు. దీనికి ముందు..ఆయన యుపిలోని అనేక ఇతర జిల్లాల్లో కూడా ఎస్పీగా పనిచేశారు. ఖుషీనగర్ ఎస్పీ సంతోష్ కుమార్ మిశ్రా ఐపీఎస్ ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆయన మంచి ఫారిన్ ఉద్యోగం వదిలేసి యూపీఎస్సీ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు. యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అయ్యారు.
READ MORE: Israel-Lebanon: లెబనాన్‌లోకి ప్రవేశించి దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధం.. సరిహద్దులో యుద్ధ ట్యాంకులు
సంతోష్ కుమార్ మిశ్రా కథ
సంతోష్ కుమార్ మిశ్రా 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సంతోష్ కుమార్ మిశ్రా కుటుంబం బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందినది. సాధారణ యువకుడిలాగే సంతోష్ కుమార్ మిశ్రా 10వ, 12 తర్వాత ఇంజినీరింగ్‌ని ఎంచుకుని పూణే యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేరారు. తన తండ్రి మిలిటరీలో ఉన్నందున, ఆయన కూడా సైన్యం, దేశ సేవ వైపు మొగ్గు చూపారు. 2004 సంవత్సరంలో.. ఆయన న్యూయార్క్ కంపెనీకి క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందారు. అక్కడ ఓ కంపెనీలో మంచి ప్లేస్‌మెంట్ వచ్చింది. కంపెనీ ఆఫర్ చేసిన ప్యాకేజీ భారతీయ రూపాయలలో 50 లక్షలు అని సంతోష్ కుమార్ మిశ్రా చెప్పారు. ప్యాకేజ్ బాగుంది కాబట్టి తాను జాయిన్ అయినట్లు తెలిపారు. ఆయన అలాగే పనిచేసి ఉంటే.. ప్రస్తుతం జీతం రూ. కోటి వరకు ఇచ్చి ఉండేది.
READ MORE: Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబంపై కేసు..!
విదేశాల్లో లక్షల విలువ చేసే ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారనే ప్రశ్న..
విదేశాల్లో లక్షల విలువ చేసే ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. విదేశాలకు వెళ్లిన తర్వాత ఉద్యోగం బాగానే ఉందని, అయితే దేశానికి, సమాజానికి మనం ఏమీ చేయలేకపోతున్నామనే బాధ ఎప్పుడూ మనసులో ఉండేదని సంతోష్ కుమార్ మిశ్రా చెప్పారు. తండ్రి లక్ష్మణ్ మిశ్రా మిలటరీలో ఉండటం వల్ల చదువు, పెంపకం కూడా ఈ వాతావరణంలోనే సాగింద వివరించారు. అటువంటి పరిస్థితిలో.. ఆయన తన ఉద్యోగాన్ని వదిలి తన దేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు ఆయన నిర్ణయాన్ని పెద్దగా ఇష్టపడలేదు. కానీ 2011 సంవత్సరంలో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఏడాది ఐపీఎస్ శిక్షణ అనంతరం ఆయనను ఉత్తరప్రదేశ్ కేడర్‌కు కేటాయించారు. ప్రొబేషన్ పీరియడ్ తర్వాత సెప్టెంబర్ 3, 2014న ఎస్పీగా ఛార్జి తీసుకున్నారు.
career, education, ips santosh mishra, success story, who left job of 50 lakhs, cracked upsc, upsc, become ips, sp-of kushinagar, kushinagar, up, nakali noton, encounter