NTV Telugu Site icon

Formula E Car Race Case : కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు..

Ed

Ed

ఫార్ములా ఈ-రేసు కేసులో జనవరి 7న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసు ఇచ్చింది. నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించింది. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.

READ MORE: Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..

తాజాగా కోర్టు తీర్పు వెలువరించడంతో మరోసారి ఈడీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈనెల16న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. వ్యక్తి గతంగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనడంపై ఓ అంతర్యం ఉంది. సోమవారం ఏసీబీ విచారణ నిమిత్తం ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ వచ్చారు. అక్కడ న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని నిలదీశారు. దీంతో రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. దీంతో విచారణకు హాజరుకాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి సోమవారం నోటీసులిచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

READ MORE: Rajinikanth: రిపోర్టర్‌పై ‘సూపర్ స్టార్’ అసహనం!

Show comments