Kejriwal: కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసు.. హాజరుపై ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లిక్కర్ పాలసీ కేసులో (Liquor Policy Case) ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు (Delhi CM Arvind Kejriwal) మరోసారి ఈడీ నోటీసు ఇచ్చింది. ఈ నెల 19న హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఇప్పటికే కేజ్రీవాల్‌కు ఐదుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. ఇలా దాదాపుగా ఐదుసార్లు విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించగా విచారణకు కేజ్రీవాల్ సహకరించాలని తెలిపింది. దీంతో లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది.
ఇంతకుముందు 2023 నవంబర్ 2, డిసెంబర్ 21, 2024 జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. తాజాగా మరోసారి బుధవారం(14-02-2024) నోటీసులు ఇచ్చింది.
Also Read
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
సార్వత్రిక ఎన్నికల ముందు ఈడీ (Enforcement Directorate) నోటీసులు ఇవ్వడాన్ని ఆప్ తప్పుపడుతోంది. ఉద్దేశ పూర్వకంగానే ఈడీని బీజేపీ అడ్డంపెట్టుకుని వేధిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. తాజా నోటీసుపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆరోసారి కూడా విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొడతారా? లేదంటే హాజరవుతారా? అన్నది వేచి తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. కొన్ని నెలల నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. పలుమార్లు ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే ఇటీవల వివాహ కార్యక్రమం నిమిత్తం మాత్రం తాత్కాలిక బెయిల్‌ను సిసోడియాకు మంజూరు చేసింది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా జైల్లో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.
Enforcement Directorate has issued sixth summons to Delhi CM Arvind Kejriwal asking him to appear on February 19 in liquor policy case
(file photo) pic.twitter.com/c316WsD2iF
— ANI (@ANI) February 14, 2024
తాజావార్తలు
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!