Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- నందిగ్రామ్‌లో బీజేపీ భారీ వ్యూహం
- దివంగత పీఏ తల్లి హసిరాణి రథ్‌కు టికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Candidates for Bengal Bypolls 2026: పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులను ప్రకటించింది. రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించింది. హైప్రొఫైల్ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి హసిరాణి రథ్‌ను అభ్యర్థిగా ప్రకటించగా.. రెజీనగర్ నియోజకవర్గం నుంచి సఖరావ్ సర్కార్‌కు టికెట్ ఇచ్చింది. నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన హసిరాణి రథ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శుభేందు అధికారి దివంగత పీఏ చంద్రనాథ్ రథ్ తల్లి. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే చంద్రనాథ్ రథ్ హత్యకు గురికావడంతో ఈ టికెట్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రనాథ్ రథ్ ఎవరు?
2026 మే 6న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత.. శుభేందు అధికారి అప్పటి పీఏగా పనిచేసిన చంద్రనాథ్ రథ్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యంగ్రామ్‌లో కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత బీజేపీ నాయకత్వం ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. చివరకు నందిగ్రామ్ వంటి కీలక నియోజకవర్గంలో చంద్రనాథ్ రథ్ తల్లి హసిరాణి రథ్‌ను బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
హసిరాణి రథ్ ఎవరు?
62 ఏళ్ల హసిరాణి రథ్ తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని చండీపూర్ ప్రాంతంలోని కులుప్ గ్రామానికి చెందినవారు. ఆమెకు స్థానిక రాజకీయాల్లో అనుభవం ఉంది. పంచాయతీ స్థాయిలో ప్రజాప్రతినిధిగా కూడా పనిచేశారు. 2013 నుంచి 2018 వరకు చండీపూర్ పంచాయతీ సమితిలో శిశు, మహిళా అభివృద్ధి విభాగం కర్మాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. మొదట్లో ఆమె తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. అయితే శుభేందు అధికారి టీఎంసీని వీడి బీజేపీలో చేరిన తర్వాత హసిరాణి రథ్ కూడా బీజేపీలో చేరారు.
అధికారి కుటుంబంతో రెండు దశాబ్దాల అనుబంధం
రథ్ కుటుంబానికి శుభేందు అధికారి కుటుంబంతో సుదీర్ఘకాలంగా రాజకీయ, వ్యక్తిగత అనుబంధం ఉన్నట్లు సమాచారం. శుభేందు అధికారి రాజకీయ ప్రస్థానం ప్రారంభ దశ నుంచే రథ్ కుటుంబం ఆయనకు మద్దతుగా నిలిచింది. 2020 డిసెంబర్లో శుభేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సమయంలో హసిరాణి రథ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా బీజేపీలో చేరారు. అయితే హసిరాణి రథ్ గతంలో తాను 1998 నుంచే రాజకీయాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. హసిరాణి రథ్ భర్త 2024లో మరణించారు. ఇప్పుడు నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వడంతో ఈ నియోజకవర్గ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
రెజీనగర్ నుంచి సఖరావ్ సర్కార్
మరోవైపు రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ సఖరావ్ సర్కార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో పశ్చిమ బెంగాల్లో జరగనున్న రెండు అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. నందిగ్రామ్ నుంచి హసిరాణి రథ్‌ను బరిలోకి దించడం ద్వారా బీజేపీ స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!