South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Movies: ఈ వారం సౌత్ సినిమా ప్రేక్షకులకు థియేటర్లలో విభిన్నమైన వినోదం పంచడానికి పలు క్రేజీ సినిమాలు సిద్ధమయ్యాయి. హార్డ్-హిట్టింగ్ క్రైమ్ డ్రామాలు, ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్స్, రూరల్ యాక్షన్ జోనర్లలో సరికొత్త కథలతో కొత్త సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మరి ఆ లిస్ట్ పై ఓ లుక్ వేద్దాం పదండి.
దాయ్రా (Daayra)
జాతీయ అవార్డు గ్రహీత మేఘ్నా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా 2026 సెప్టెంబర్ 18న హిందీ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఒక ఘోరమైన నేర పరిశోధన చుట్టూ ఈ కథ నడుస్తుంది. కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకూమారన్ ల ఇన్-టెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఫేస్-ఆఫ్‌తో ఈ సినిమా సాగనుంది.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ఎన్న విలై (Enna Vilai)
సజీవ్ పజూర్ దర్శకత్వం వహించిన ఈ సోషియో-పొలిటికల్ కోర్ట్‌రూమ్ డ్రామా 2026 సెప్టెంబర్ 17న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్-ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. రామేశ్వరం సముద్ర తీరంలో భక్తులు విసిరే నాణేలను ఏరుకుంటూ బతికే ఒక సాధారణ మత్స్యకారుడికి బంగారం లాకెట్ దొరుకుతుంది. ఆ తర్వాత అతనిపై పడే తప్పుడు నేరారోపణలు, దాని వెనుక ఉన్న అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక లేడీ లాయర్ కోర్టులో ఎలాంటి న్యాయపోరాటం చేసిందనేది ఈ సినిమా కథాంశం. ఇందులో కరుణాస్, నిమిషా సజయన్, వై. జి. మహేంద్రన్, పూర్ణిమా భాగ్యరాజ్, నిళల్గల్ రవి ప్రధాన పాత్రల్లో నటించారు.
ది డార్క్ హెవెన్ (The Dark Heaven)
బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ 2026 సెప్టెంబర్ 18న తమిళం, మలయాళ భాషల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ కథ ఒక మారుమూల హిల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఆ ఊరిలో ప్రతి ఏడేళ్లకు ఒకసారి జూన్ నెలలో మగవారు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. దీనిని గ్రామస్థులు ఒక దుష్టశక్తి శాపంగా నమ్ముతారు. ఆ మిస్టరీని ఛేదించడానికి అక్కడికి బదిలీపై వచ్చిన ఒక కొత్త ఇన్స్పెక్టర్, దశాబ్దాలుగా ఆ ఊరు దాచిన భయంకరమైన రహస్యాలను ఎలా వెలికితీశాడు అనేదే గూస్బంప్స్ తెప్పించే ఈ సస్పెన్స్ కథ. ఇందులో సిద్ధు సిద్, తర్షికా, రిత్విక పన్నీర్‌సెల్వం, వేలా రామమూర్తి కీలక పాత్రలు పోషించారు.
సీక్రెట్ సోల్జర్ (Secret Soldier)
అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో మూన్ లైట్ డ్రీమ్స్ నిర్మించిన ఈ తెలుగు హై-స్టేక్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 2026 సెప్టెంబర్ 18న విడుదల కానుంది. ఒక సాదాసీదా కాలేజీ స్టూడెంట్.. దేశాన్ని ముంచేసే నకిలీ కరెన్సీ స్కామ్, అంతర్జాతీయ పొలిటికల్ హ్యాకింగ్ కుట్రలో అనుకోకుండా చిక్కుకుంటాడు. దేశభక్తి, నమ్మకద్రోహం చుట్టూ సాగే ఈ మిషన్‌లో అతను ఒక రహస్య సైనికుడిగా మారి శక్తివంతమైన శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఇందులో చూపించనున్నారు. ఇందులో నిహాల్ కోదండరామ్ (నిహాల్ కోదటి), సూర్య శ్రీనివాస్, కమల్ కామరాజు, రఘు బాబు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (It’s a Medical Miracle)
తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ వినూత్న సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్ 2026 సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఒక ఘోరమైన ప్రమాదం తర్వాత కోమాలోకి వెళ్లి, మళ్లీ స్పృహలోకి వచ్చిన ఒక సాధారణ యువకుడికి విచిత్రంగా ‘సూపర్-హియరింగ్’ (అతి సూక్ష్మమైన శబ్దాలను కూడా వినగలిగే) అద్భుతమైన శక్తి లభిస్తుంది. తను కోమాలో ఉన్నప్పుడు రోజు తనతో మాట్లాడి బతికించిన ఒక అపరిచిత నర్స్ కోసం అతను వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో తనకున్న వినికిడి శక్తి వల్ల అతను ఆ రహస్యాలను ఎలా ఛేదించాడు అనేదే ఈ సినిమా అసలు కథ.
వీటితో పాటు ‘టాస్’ (Toss), ‘హ్యాపీ జర్నీ’ (Law and Order), ‘లా అండ్ ఆర్డర్’ (Happy Journey) అనే ఈ మూడు విభిన్న జోనర్ల సినిమాలు కూడా 2026 సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ‘టాస్’ (Toss), ‘హ్యాపీ జర్నీ’ (Happy Journey) చిత్రాలు స్నేహం, రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ కామెడీ, సస్పెన్స్ డ్రామాలు కాగా, ‘లా అండ్ ఆర్డర్’ (Law and Order) అనేది ఒక సిటీ క్రైమ్ గ్యాంగ్‌ను పట్టుకునే నేపథ్యంలో సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Tags
- cinema
- South Movies
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!