Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Economic Blow To Pakistan Uae Pressures Shehbaz Sharif Govt For Loan Recovery As Middle East Conflict Escalates

Pakistan: పాకిస్తాన్‌కు భారీ షాక్.. అప్పు చెల్లించాలని యూఏఈ ఒత్తిడి..

Published Date :April 4, 2026 , 4:00 pm
By Venu Goapl Reddy
  • పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన యూఏఈ..
  • అప్పు తిరిగి చెల్లించాలని కోరిన గల్ఫ్ దేశం..
Pakistan: పాకిస్తాన్‌కు భారీ షాక్.. అప్పు చెల్లించాలని యూఏఈ ఒత్తిడి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. ఇదిలా ఉంటే, ఇదే సమయంలో పాకిస్తాన్‌‌ను తమ అప్పు తీర్చాల్సిందిగా యునైడెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కోరింది. తమ డబ్బులు తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏప్రిల్‌లో మొత్తం 3.5 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధ నేపథ్యంలో యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇరాన్ దాడులతో యూఏఈ కూడా ఇబ్బందుల పాలవుతోంది. దుబాయ్, అబుదాబీలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో యూఏఈ తన రుణాన్ని త్వరగా తిరిగి పొందాలని భావిస్తోంది.

Read Also: Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

పాకిస్తాన్ యూఏఈకి ఇవ్వాల్సిన రుణ చెల్లింపులను షెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 11న 450 మిలియన్ డాలర్లను, ఏప్రిల్ 17న 2 బిలియన్ డాలర్లను, ఏప్రిల్ 23న 1 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాలని నిర్ణయించుకుంది. ఇదే నెలలో 1.3 బిలియన్ డాలర్ల యూరోబాండ్ కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో ఏప్రిల్‌లో మొత్తంగా 4.8 బిలియన్ డాలర్లను పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 16.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇందులో మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, చైనా నుంచి వచ్చిన డిపాజిట్లే ఎక్కువ. ఈ వ్యవహారంపై ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. విదేశీ సాయంపై ఆధారపడాల్సి రావడం తనకు ఇబ్బందికరంగా ఉందని అన్నారు.

మరోవైపు, పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా పెరిగాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం కారణంగా పాకిస్తాన్‌ చమురు ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. మరోవైపు, దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఎగుమతులు 8 శాతం తగ్గాయి. విదేశీ పెట్టుబడులు తగ్గడంతో పాటు అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది. ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్లను అప్పుగా తీసుకుంది. ఈ ప్రోగ్రాం కింద తీసుకునే ఆర్థిక క్షమశిక్షణ చర్యలతో పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IMF loan to Pakistan
  • Iran war impact on UAE
  • Pakistan
  • pakistan economic crisis
  • pakistan forex reserves

తాజావార్తలు

  • Pakistan: పాకిస్తాన్‌కు భారీ షాక్.. అప్పు చెల్లించాలని యూఏఈ ఒత్తిడి..

  • Raghav chadha: ‘‘నేను గాయపడ్డాను..’’.. ఆప్‌కు ధురంధర్ స్టైల్‌లో రాఘవ్ చద్దా రిప్లై..

  • DC Vs MI: టాస్ గెలిచిన డిల్లీ.. MI బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

  • Andhra Pradesh New Map: అమరావతి రాజధానిగా.. 28 జిల్లాలతో కొత్త మ్యాప్‌..

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions