CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 6న బాసర సరస్వతి ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.225 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి సమగ్ర మాస్టర్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం కాగా, ఆలయాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రహదారులు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆలయ పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈవీ వాహనాలనే అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నియంత్రణలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ, ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
READ MORE: Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!