DC Vs MI: టాస్ గెలిచిన డిల్లీ.. MI బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయనుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ‘హార్దిక్ ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఈరోజు ఆడటం లేదు. గత మ్యాచ్ (KKRపై) గెలవడం జట్టులో పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. వాంఖెడేతో పోలిస్తే ఇక్కడి పిచ్ వేరుగా ఉంటుంది. టాస్ గురించి ఆలోచించడం లేదు, మేము బ్యాటింగ్ చేయాలనుకున్నాం, అది దక్కినందుకు సంతోషంగా ఉందని సూర్య కుమార్ యాదవ్ అన్నారు.
‘ఇది మా హోమ్ గ్రౌండ్, వికెట్ ఎలా స్పందిస్తుందో చూడాలని బౌలింగ్ ఎంచుకున్నాం. గత మ్యాచ్‌లో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా గెలవడం మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పేర్కొన్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
డేవిడ్ మిల్లర్ అభిప్రాయం.. IPL వంటి బిజీ టోర్నీలో ప్రయాణాలు, అంచనాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి విశ్రాంతి (downtime) చాలా ముఖ్యం. పరిస్థితిని బట్టి దూకుడుగా ఆడటమా లేక ఇన్నింగ్స్ నిర్మించడమా అనేది ఆధారపడి ఉంటుంది. గత మ్యాచ్‌లో సమీర్ రిజ్వీ, స్టబ్స్ అద్భుతంగా ఆడి ఒత్తిడి తగ్గించారన్నారు.
తుది జట్లు ఇలా..
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బోష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా. (ఇంపాక్ట్ సబ్స్: మయాంక్ మార్కండే, రాబిన్ మింజ్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, అశ్విని కుమార్)
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
కెఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగీ ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్. (ఇంపాక్ట్ సబ్స్: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ దార్, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీర, కరుణ్ నాయర్)
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Illandu Missing Person : ఇల్లందులో 45 రోజులుగా కనిపించని వ్యక్తి.. వీడని మిస్టరీ
-
SL Vs PAK: శ్రీలంకపై పాకిస్థాన్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇలా..
-
Rajasthan: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం.. సీఎం, మంత్రుల కంచుకోటల్లో బీజేపీకి షాక్..
-
India Rafale Jets: 4 రాఫెల్ జెట్లు మిస్సింగ్.. బ్రిటీష్ నివేదికపై మాజీ ఎయిర్ మార్షల్ ఫైర్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!